కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బు తీయొచ్చు.. కేవలం ఫోన్ ఉంటే చాలు.. ఎలాగో తెలుసుకోండి..
Withdrawal Money ATM Without Card : మీకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకుకు వెళ్లి స్లిప్ నింపడం ద్వారా లేదా డెబిట్ కార్డు ద్వారా ఏటీఎమ్ నుంచి విత్ డ్రా చేసుకుంటారు. అయితే ఏటీఎమ్ నుంచి డబ్బును
Withdrawal Money ATM Without Card : మీకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకుకు వెళ్లి స్లిప్ నింపడం ద్వారా లేదా డెబిట్ కార్డు ద్వారా ఏటీఎమ్ నుంచి విత్ డ్రా చేసుకుంటారు. అయితే ఏటీఎమ్ నుంచి డబ్బును విత్ డ్రా చేయాలంటే మీరు కార్డును స్వైప్ చేయాలి తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీకు డబ్బు వస్తుంది. కానీ ఇప్పుడు డెబిట్ కార్డు లేకుండా ఏటీఎమ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయొచ్చు.. అవును ఇది నిజం.. ఇప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఏటీఎమ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. దీనికి మీకు కార్డు అవసరం లేదు. వాస్తవానికి మీరు యుపిఐ అప్లికేషన్ ద్వారా ఎటిఎం నుంచి డబ్బును విత్ డ్రా చేయొచ్చు.. అయితే కార్డు లేకుండా ఏటీఎమ్ నుంచి డబ్బును ఎలా విత్ డ్రా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
యూటీఐ అప్లికేషన్ ద్వారా ఏటీఎమ్ నుంచి డబ్బు తీసుకోవచ్చు.. ఉదాహరణకు BHIM, PayTM లేదా Google Pay నివేదిక ప్రకారం.. యూపీఐ ఆధారిత ఐసీసీడబ్ల్యూను అంటే ఇంటర్‌పెరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ ఉపసంహరణ పరిష్కారాన్ని ప్రారంభించినట్లు ఎటీఎం తయారీ సంస్థ ఎన్‌సిఆర్ కార్పొరేషన్ తెలిపింది. దీని ద్వారా ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేయవచ్చు. యూనియన్ బ్యాంక్ ఈ స్పెషల్ కండిషన్డ్ ఏటీఎమ్‌ను ఎన్‌సిఆర్‌లో ఏర్పాటు చేయడం ప్రారంభించిందని, ఇప్పటివరకు 1500 కి పైగా ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేశారని చెబుతున్నారు. అప్పటి నుంచి చాలా ఏటీఎంలలో ప్రజలు కార్డు లేకుండా నగదు విత్ డ్రా చేస్తున్నారు. అయితే ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?
మొదట అప్‌గ్రేడ్ చేసిన కొన్ని ఏటీఎంలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని తెలియజేస్తున్నాం. అదే సమయంలో డబ్బును విత్ డ్రా చేయడానికి మీరు మొదట ఏటీఎంకు వెళ్ళాలి. ఆ తరువాత మీరు యూటీఐ అప్లికేషన్ ద్వారా ఏటీఎమ్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవలసి ఉంటుంది.. తరువాత మీరు ఏటీఎమ్ నుంచి కమాండ్ ఇవ్వాలి. అనంతరం ఇది మీరు ఎంచుకున్న ఖాతా నుంచి డబ్బును తగ్గిస్తుంది. ఏటీఎమ్‌లలో నగదు లభిస్తుంది.