AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi: భారత్‌లో రెడ్‌మీ 10 సిరీస్‌ సంచలనం.. కేవలం రెండు వారాల్లోనే ఎన్ని కోట్ల బిజినెస్‌ జరిగిందో తెలుసా.?

Redmi Note 10 Record Sales: ప్రముఖ చైనా మొబైల్‌ తయారీ సంస్థ రెడ్‌మీ భారత్‌ మార్కెట్లో దూసుకెళుతోంది. నిత్యం కొంగొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ ఫోన్లను తీసుకొస్తూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ క్రమంలోనే రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి నోట్‌ 10 సిరీస్‌తో...

Redmi: భారత్‌లో రెడ్‌మీ 10 సిరీస్‌ సంచలనం.. కేవలం రెండు వారాల్లోనే ఎన్ని కోట్ల బిజినెస్‌ జరిగిందో తెలుసా.?
Redmi 10 Series
Narender Vaitla
|

Updated on: Apr 02, 2021 | 4:38 PM

Share

Redmi Note 10 Record Sales: ప్రముఖ చైనా మొబైల్‌ తయారీ సంస్థ రెడ్‌మీ భారత్‌ మార్కెట్లో దూసుకెళుతోంది. నిత్యం కొంగొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ ఫోన్లను తీసుకొస్తూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ క్రమంలోనే రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి నోట్‌ 10 సిరీస్‌తో ఓ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. మార్చి ప్రారంభంలో వచ్చిన ఈ ఫోన్లు రికార్డు అమ్మకాలు నమోదు చేసుకుంది. రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌ మార్కెట్లోకి వచ్చిన కేవలం రెండు వారాల్లోనే భారత్‌లో ఏకంగా రూ.500 కోట్ల అమ్మకాలు జరిగినట్లు షియోమీ తాజాగా ప్రకటించింది.10 సిరీస్‌లో వచ్చిన.. రెడ్‌మీ నోట్‌ 10, రెడ్‌ మీ నోట్‌ 10 ప్రో, రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మాక్స్‌ మూడు స్మార్ట్‌ఫోన్లు యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. మార్చి 16, 17, 18లో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లు కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ స్థాయిలో అమ్ముడు పోవడం విశేషం. అయితే షియోమీ ఎన్ని ఫోన్లు అమ్ముడు పోయాయన్నదానిపై మాత్రం స్పష్టత నివ్వలేదు. ఈ మూడు ఫోన్లలో ఏ ఫోన్‌ ఎక్కువగా అమ్ముడుపోయిందన్న క్లారిటీ లేదు. అయితే ఓ అంచనా ప్రకారం షియోమీ రెడ్‌ మీ నోట్‌ 10 సిరీస్‌ ఫోన్‌లను 2,27,000 నుంచి 4,16,000 యూనిట్ల రెడ్‌మి నోట్ 10 సిరీస్ ఫోన్‌ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది.

రెడ్‌మీ 10 సిరీస్‌ ఫీచర్ల విషయానికొస్తే..

* 16.33 సె.మీల సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే. * 48 మెగా పిక్సెల్‌ కెమెరా (బ్యాక్‌), 13 మెగా పిక్సెల్‌ కెమెరా (సెల్ఫీ) * క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 678 ప్రాసెసర్‌. * 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌. * డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌. * Z- యాక్సిస్‌ వైబ్రేషన్‌ మోటర్‌. * సైడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌.

Also Read: అప్పు చెల్లించేందుకు ‘రిలయన్స్ సెంటర్’ ను అమ్మేసిన అనిల్‌ అంబానీ.. యెస్‌ బ్యాంక్‌ ఎంతకు కొనుగోలు చేసిందంటే..?

Honda Vehicles Recalls : ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి రప్పించిన హోండా కంపెనీ.. కారణం ఏమిటంటే..?

Petrol Diesel Rates: వాహనదారులకు ఇది నిజంగా ఊరటే.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే..