AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk Star link: ఎలాన్‌మస్క్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ.. స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ బీటా వెర్షన్‌ అమ్మకంపై..

Elon Musk Star link: టెస్లా కార్ల కంపెనీలతో పాటు స్పేస్‌ఎక్స్‌ వంటి అంతరిక్ష సంస్థతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎలాన్‌ మస్క్‌ తాజాగా ఇంటర్నెట్‌ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో...

Elon Musk Star link: ఎలాన్‌మస్క్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ.. స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ బీటా వెర్షన్‌ అమ్మకంపై..
Elon Musk Star Link
Narender Vaitla
|

Updated on: Apr 02, 2021 | 5:07 PM

Share

Elon Musk Star link: టెస్లా కార్ల కంపెనీలతో పాటు స్పేస్‌ఎక్స్‌ వంటి అంతరిక్ష సంస్థతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎలాన్‌ మస్క్‌ తాజాగా ఇంటర్నెట్‌ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో అందుబాటులో ఉన్న స్పేస్‌ ఎక్స్‌ ఇంటర్నెట్‌ సేవలు త్వరలో భారత్‌లోకి కూడా రానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఎలాన్‌ మస్క్‌ అధికారికంగా ప్రకటించాడు కూడా. స్టార్‌ లింక్‌ పేరుతో రానున్న ఈ ఇంటర్నెట్ సేవల కోసం ఏకంగా అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధమయ్యారు. అంతటితో ఆగకుండా భారత్‌లో ప్రీ బుకింగ్‌లను కూడా ప్రారంభించిందీ సంస్థ. 2022 నాటికి భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న స్పేస్‌ ఎక్స్‌ ఆ మార్గంలో వెళ్తోంది. అయితే ఇదిలా ఉంటే.. భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్న స్పేస్‌ఎక్స్‌ టెక్నాలజీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్పేస్‌ఎక్స్‌ టెక్నాలజీస్‌ స్టార్‌ లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవల బీటా వెర్షన్‌ను ముందే అమ్మకుండా నిరోధించాలని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరమ్‌ పేర్కొంది. ఈ విషయమై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), టెలికాం రెగ్యులరేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌)లకు బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరమ్‌ లేఖ రాసింది. ఇందులో.. స్పేస్‌ఎక్స్ టెక్నాలజీస్‌ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల బీటా వెర్షన్‌ను ముందే అమ్మకుండా నిరోధించాలని పేర్కొంది. భారతదేశంలో ఇలాంటి సేవలను అందించేందుకు స్పేస్‌ఎక్స్‌కు అనుమతులు లేవని ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే స్పేస్‌ఎక్స్ భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ బీటా సేవల ప్రీ-ఆర్డర్‌ల కోసం 99 డాలర్లు( సుమారు రూ.7,000) చెల్లించాలని గతంలో ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. మరి భారత్‌లో స్టార్‌ లింక్‌ సేవలు అందుబాటులోకి వస్తాయో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బు తీయొచ్చు.. కేవలం ఫోన్‌ ఉంటే చాలు.. ఎలాగో తెలుసుకోండి..

Humans Venom: వామ్మో.. మనుషుల్లోనూ విషం ఉందా? శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయం నిజమేనా?

Google Meet: గూగుల్‌ మీట్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత సేవలను మరికొంత కాలం పొడగించిన టెక్‌ దిగ్గజం..