Google Meet: గూగుల్‌ మీట్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత సేవలను మరికొంత కాలం పొడగించిన టెక్‌ దిగ్గజం..

Google Meet: కరోనా కారణంగా ఉద్యోగుల పనితీరు పూర్తిగా మారిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. అప్పటి వరకు 'ఇంటి నుంచి ఉద్యోగం' విధానాన్ని అమలు చేయని కంపెనీలు కూడా కరోనా..

Google Meet: గూగుల్‌ మీట్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత సేవలను మరికొంత కాలం పొడగించిన టెక్‌ దిగ్గజం..
Google Meet
Follow us

|

Updated on: Apr 02, 2021 | 4:04 PM

Google Meet: కరోనా కారణంగా ఉద్యోగుల పనితీరు పూర్తిగా మారిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. అప్పటి వరకు ‘ఇంటి నుంచి ఉద్యోగం’ విధానాన్ని అమలు చేయని కంపెనీలు కూడా కరోనా నేపథ్యంలో ఆ మార్గాన్ని అనుసరించక తప్పలేదు. ఇక ఆఫీసుల్లో ఉద్యోగం చేసే సమయంలో మీటింగ్‌లకు హాజరయ్యే సమయాల్లో అంతా ఒక చోట చేరి పలు అంశాలపై చర్చించుకునే వారు. కానీ ప్రస్తుతం టీమ్‌ మీటింగ్‌లు సైతం ఆన్‌లైన్‌ వేదికగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్‌ కంపెనీలు రకరకాల సాఫ్ట్‌వేర్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ వీడియో వినియోగం పెరగడంతో ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ‘గూగుల్‌ మీట్‌’ పేరుతో ఆన్‌లైన్‌ వీడియో కాల్‌ సేవలను గూగుల్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదట గూగుల్‌ ఈ సేవలను ఉచితంగా ప్రవేశపెట్టినప్పటికీ.. 2021 మార్చి 31 వరకు మాత్రమే ఉచితంగా ఉంటుందని తర్వాత ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. తాజాగా ఈ గడువు ముగిసిన నేపథ్యంలో ఉచిత సేవలను గూగుల్‌ మరోసారి పొడగించింది. ఉచిత అన్‌లిమిటెడ్‌ వీడియో కాల్‌ సేవలను 2021, జూన్‌ వరకు పొడగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అయితే గూగుల్‌ మీట్‌ ద్వారా వీడియో కాల్స్‌ చేసే జీ-మెయిల్‌ వినియోగదారులకు మాత్రమే ఈ ఉచిత సేవల పొడగింపు వర్తిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని గూగుల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఇక గూగుల్‌ హ్యాంగ్‌ అవుట్‌ పేరుతో ఉన్న ఫీచర్‌ను తర్వాత గూగుల్‌ మీట్‌గా మార్చింది. మొదట్లో కేవలం 60 నిమిషాల వరకు మాత్రమే వీడియోకాల్స్‌ చేసుకునే అవకాశం ఉన్నా.. కోవిడ్‌ తర్వాత 24 గంటలూ వీడియోకాల్స్‌ చేసుకునే వీలును కల్పించింది.

Also Read: Instagram New Feature: పూర్తిగా టిక్‌టాక్‌లా మారుతోన్న ఇన్‌స్టాగ్రామ్‌.. ‘రీమిక్స్‌’ పేరుతో మరో కొత్త ఫీచర్‌..

WhatsApp New Feature: వాట్సప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్..

Google Maps: మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైన గూగుల్.. ఆ ఫిచర్‌తో ప్రయోజనాలేంటంటే..