WhatsApp New Feature: వాట్సప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్..
WhatsApp New Feature: వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది.
WhatsApp New Feature: వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వాయిస్ మెసేజ్ ప్లే బ్యాక్ స్పీడ్ పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో వాట్సప్ యాప్ లోపల కలర్స్ ఛేంజ్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంటే.. వాట్సప్ యూజర్లు చాట్ బాక్స్‌లో టెక్ట్స్ స్కీన్‌ను ఇతర రంగులోకి మార్చుకోవచ్చు.
కాగా, వాట్సప్ వినియోగదారుల సౌలభ్యం కోసం వాయిస్ మెసేజ్‌ల ప్లేబ్యాక్ వేగాన్ని ఛేంజ్ చేసుకునే ఫీచర్‌పై పనిచేస్తున్నట్లు వాట్సప్ ఇటీవల ప్రకటించింది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సప్ బీటాలో ప్రయోగదశలో ఉంది. ఇప్పుడు ఐఓఎస్ యూజర్ల కోసం ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. ఈ ఫీచర్‌తో వాట్సప్ యూజర్లు వాయిస్ నోట్స్‌ని స్పీడ్ మోషన్‌లో వినడానికి వీలు ఉంటుంది. ఈ ఫీచర్ వాట్సప్ వెర్షన్ 2.21.60.11 తో విడుదల అవుతుంది. ఇది మొత్తం మూడు దశల స్పీడ్ స్థాయిలను కలిగి ఉంటుంది అవి 1x, 1.5x, 2x. యూజర్లు ఈ వేగాలలో ఏదైనా ఆడియో సందేశాలను ప్లే చేయగలుగుతారు.
Also read: