AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komaki MX3 Electric Bike : సింగిల్ చార్జిపై 100 కిలోమీటర్ల ప్రయాణం.. బ్లూటూత్ క‌నెక్టివిటీ.. డ‌బుల్ డిస్క్ బ్రేక్‌లు.. అతి తక్కువ ధర..

Komaki MX3 Electric Bike : దేశీయ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ KLB KOMAKI PVT LTD ఈ ఏడాది ప్రారంభంలో హై-స్పీడ్ మోటార్‌సైకిల్, M-5 మోడ‌ల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మరో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల

Komaki MX3 Electric Bike : సింగిల్ చార్జిపై 100 కిలోమీటర్ల ప్రయాణం.. బ్లూటూత్ క‌నెక్టివిటీ.. డ‌బుల్ డిస్క్ బ్రేక్‌లు.. అతి తక్కువ ధర..
Komaki Mx3 Electric Bike
uppula Raju
|

Updated on: Apr 02, 2021 | 8:23 PM

Share

Komaki MX3 Electric Bike : దేశీయ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ KLB KOMAKI PVT LTD ఈ ఏడాది ప్రారంభంలో హై-స్పీడ్ మోటార్‌సైకిల్, M-5 మోడ‌ల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మరో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే ఎలక్ట్రిక్ బైక్ పేరు కొమాకి- MX3. కొమాకి సంస్థ ఇప్ప‌టివ‌ర‌కు మూడు ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కొమాకి ఎంఎక్స్ బైక్‌ 17 అంగుళాల చక్రాలు, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్స్ అలాగే విశాల‌మైన సీటు కలిగి ఉంటుంది.

కోమాకి ఎంఎక్స్ self-diagnosis system, రివర్స్ అసిస్ట్, రీజ‌న‌రేటివ్ బ్రేకింగ్ సిస్టం, మూడు స్పీడ్ మోడ్‌లు ఉంటాయి., ప్రయాణంలో కనెక్టివిటీ కోసం ఇన్‌బిల్ట్‌ బ్లూటూత్ స్పీకర్ మరియు ఫుల్ క‌ల‌ర్డ్ ఎల్‌ఇడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను ఇందులో చూడ‌వ‌చ్చు. ముందు వెనుక డ‌బుల్ డిస్క్ బ్రేక్‌ల‌ను వినియోగించారు. ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ ఎక్స్ షోరూం ధ‌ర సుమారు రు.95,000 ఉండొచ్చు

సింగిల్ చార్జ్‌పై 100కి.మి Komaki MX3 electric బైక్ సింగిల్ ఛార్జ్‌లో 85-100 కిలోమీటర్లు ప్ర‌యాణిస్తుంది. కొమాకి, ఎంఎక్స్ బైక్ 1 నుంచి 1.5 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగించదని కంపెనీ పేర్కొంది. డిటాచ‌బుల్ లిథియం-అయాన్ బ్యాటరీని ఇందులో వినియోగించారు. ఇక ఈ బైక్ గార్నెట్ ఎరుపు, డీప్ నీలం మరియు జెట్ బ్లాక్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

Taiwan train crash : సొరంగ మార్గంలో పట్టాలు తప్పిన రైలు.. డ్రైవర్‌ సహా 51కి చేరిన మృతులు, 146 మందికి తీవ్ర గాయాలు

Manju Warrier pic viral : టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తున్న నలభై ఏళ్ల హీరోయిన్.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు..

మయన్మార్‌‌లో కొనసాగుతున్న సైన్యం క్రూరత్వం.. పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్న చిన్నారులు.. ఖండించిన అంతర్జాతీయ సమాజం