PM Kisan: రైతులకు చేదువార్త.. పార్లమెంట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక ప్రకటన
మోడీ సర్కార్ రైతులకు ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఒకటి. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6000 చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది. ఈ స్కీమ్ మొత్తాన్ని..
మోడీ సర్కార్ రైతులకు ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఒకటి. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6000 చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది. ఈ స్కీమ్ మొత్తాన్ని పెంచనున్నట్లు బడ్జెట్‌కు ముందు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నిర్మలాసీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పథకంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పుడు చేదు వార్త వినిపించారు మంత్రి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక సమాచారాన్ని తెలియజేశారు. మీరు కూడా 13వ వాయిదా కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీ ఖాతాలో రూ. 2000 ఇన్‌స్టాల్‌మెంట్ రాబోతోంది. దేశంలోని కోట్లాది మంది రైతులకు ప్రధాని మోదీ 6000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం 2019 సంవత్సరంలో ప్రారంభించబడింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుండి వస్తున్న అప్‌డేట్ ఏమిటో తెలుసుకుందాం.
వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌లో ఈ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సాయం మొత్తాన్ని పెంచే ప్రతిపాదన లేదని చెప్పారు.
రూ.2,24 లక్షల కోట్లు విడుదల చేశామని, జనవరి 30 వరకు రైతులకు రూ.2,24 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక పథకం. ఇందులో 100 శాతం నిధులు ఉన్నాయి. దీంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.
పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అర్హులైన రైతులకు మొత్తం రూ.2.24 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నూరు శాతం నిధులు సమకూరుస్తోందని అన్నారు. అలాగే ఈకేవైసీ చేయని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందవని మం త్రి స్పష్టం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి