AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2035 నాటికి ప్రపంచానికి రారాజుగా మారబోతున్న భారత్.. నీతి ఆయోగ్ సంచలన నివేదిక వెల్లడి!

రాబోయే దశాబ్ద కాలంలో భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్ రంగానికి కొత్త ‘రాజు’గా అవతరించబోతోంది. కేవలం చిప్‌లను కొనుగోలు చేసే మార్కెట్‌గా మిగిలిపోకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదగడమే లక్ష్యంగా భారత్ ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన సరికొత్త నివేదిక వెల్లడిస్తోంది.

2035 నాటికి ప్రపంచానికి రారాజుగా మారబోతున్న భారత్.. నీతి ఆయోగ్ సంచలన నివేదిక వెల్లడి!
Semiconductor Manufacturing Hub
Balaraju Goud
|

Updated on: May 30, 2026 | 11:17 AM

Share

ఈ రోజుల్లో, మనం చేతిలో పట్టుకునే స్మార్ట్‌ఫోన్ నుండి రోడ్లపై నడిచే స్మార్ట్ కార్ల వరకు, ప్రతిదీ ఒక చిన్న చిప్ అయిన సెమీకండక్టర్‌పై ఆధారపడి ఉంది. 2035 నాటికి భారతదేశం ప్రపంచంలోనే కొత్త “సెమీకండక్టర్ రాజు”గా ఎలా మారగలదో నీతి ఆయోగ్ కొత్త నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశం కేవలం చిప్ మార్కెట్‌గా మాత్రమే కాకుండా, 150 బిలియన్ డాలర్ల విలువైన బలమైన విలువ గల మార్కెట్ తో మొత్తం ప్రపంచ పరిశ్రమలో అగ్రగామిగా నిలవబోతుంది. దీనికి రాబోయే దశాబ్దంలో 180 బిలియన్ డాలర్ల వరకు భారీ పెట్టుబడి అవసరం కాగా, మొత్తం వ్యయంలో మూడింట ఒక వంతును ప్రభుత్వం భరించాలని సిఫార్సు చేయడం జరిగింది.

రాబోయే దశాబ్ద కాలంలో భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్ రంగానికి కొత్త ‘రాజు’గా అవతరించబోతోంది. కేవలం చిప్‌లను కొనుగోలు చేసే మార్కెట్‌గా మిగిలిపోకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదగడమే లక్ష్యంగా భారత్ ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన సరికొత్త నివేదిక వెల్లడిస్తోంది.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి సమర్పించిన “భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్తు” నివేదిక ప్రకారం, భారత్ ఇతరులను అనుకరించకుండా, తన స్వంత వ్యూహాత్మక బలాలతో గ్లోబల్ సప్లై చైన్‌లో అగ్రగామిగా నిలవాలి. 2035 నాటికి దేశంలోనే 120 నుండి 150 బిలియన్ డాలర్ల విలువైన భారీ సెమీకండక్టర్ విలువ గొలుసును నిర్మించబోతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

ప్రస్తుతం భారతదేశం తన సెమీకండక్టర్ అవసరాల కోసం 90 నుండి 95 శాతం వరకు ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. అయితే, 2035 నాటికి దేశీయంగా చిప్‌ల డిమాండ్ 200 బిలియన్ డాలర్లను మించిపోతుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే దేశ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, అంతర్జాతీయ సరఫరాలో అంతరాయం ఏర్పడితే దేశీయ రంగాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆధారపడటాన్ని తగ్గించడం అత్యంత కీలకంగా మారింది.

భారతదేశంలో చిప్ డిజైన్, తయారీ, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రాబోయే పదేళ్లలో 135 నుండి 180 బిలియన్ డాలర్ల భారీ మూలధనం అవసరమవుతుంది. ప్రైవేట్ రంగ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని నింపేందుకు, ఈ మొత్తం వ్యయంలో కనీసం మూడింట ఒక వంతును ప్రభుత్వమే భరించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ప్రభుత్వ భాగస్వామ్యం వల్ల ప్రాజెక్ట్ రిస్క్ తగ్గి, పెద్ద ప్రైవేట్ కంపెనీలు దీర్ఘకాలిక పెట్టుబడులతో ముందుకు వస్తాయి.

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెలికాం, రవాణా వంటి రంగాలలో ఇతర దేశాల సాంకేతికతపై ఆధారపడటాన్ని పూర్తిగా తొలగించుకోవాలని నివేదిక పేర్కొంది. 2014-2024 మధ్య కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 6.5% వృద్ధి చెందగా, రాబోయే రోజుల్లో ఇది 8.5% వేగంతో దూసుకుపోతుందని అంచనా. ఈ అపారమైన వృద్ధిని అందుకోవడానికి, మార్కెట్ లీడర్‌గా ఎదగడానికి భారతదేశం శరవేగంగా అడుగులు వేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us