Nita Ambani: నీతా అంబానీ పెళ్లి తర్వాత కూడా ఈ పని చేశారట.. జీతం రూ.800
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రాం కారణంగా మరోసారి అంబానీ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ప్రొఫెషనల్ టీచర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. పెళ్లయిన తర్వాత కూడా ఈ పనిని కొనసాగించారు. సిమి గ్రేవాల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను సన్‌ఫ్లవర్ నర్సరీలో టీచర్‌గా..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రాం కారణంగా మరోసారి అంబానీ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ప్రొఫెషనల్ టీచర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. పెళ్లయిన తర్వాత కూడా ఈ పనిని కొనసాగించారు. సిమి గ్రేవాల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను సన్‌ఫ్లవర్ నర్సరీలో టీచర్‌గా పనిచేశానని చెప్పింది. ముఖేష్ అంబానీ-నీతా అంబానీలు 1985లో వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత నీతా అంబానీకి వచ్చిన డబ్బు ఎంత?
సిమి గ్రేవాల్‌తో సంభాషణ సందర్భంగా నీతా అంబానీ తనకు టీచింగ్ కోసం నెలకు రూ.800 వచ్చేదని చెప్పారు. ప్రజలు తనను ఎగతాళి చేసేవారని ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆ ఉద్యోగం సంతృప్తిని ఇచ్చందని నీతా అంబానీ చెప్పుకొచ్చారు. అప్పట్లో నన్ను చూసి నవ్వేవారుజ. కానీ ఆ పని నాకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పారు.
ఇటీవల, అంబానీ కుటుంబం వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక్ మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆహ్వానించారు. కార్యక్రమంలో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, రిహన్నా, ఇవాంక ట్రంప్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి