భయం లేదు.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది

దేశంలో ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి భయాలు అవసరం లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ద్రవ్యోల్పణం అదుపులోనే ఉందని ఇది 4 శాతం లోపు ఉందని తెలిపారు. ఆర్ధిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో కీలకమైన రేట్ల తగ్గింపుతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని, ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతున్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ నెల 19న బ్యాంకర్లతో […]

భయం లేదు..   ద్రవ్యోల్బణం  అదుపులోనే  ఉంది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2019 | 8:01 PM

దేశంలో ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి భయాలు అవసరం లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ద్రవ్యోల్పణం అదుపులోనే ఉందని ఇది 4 శాతం లోపు ఉందని తెలిపారు. ఆర్ధిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో కీలకమైన రేట్ల తగ్గింపుతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని, ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతున్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఎగుమతులపై పన్నులను తగ్గించేలా చర్యలు తీసుకుంటామని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే సూచలను ఉన్నాయని నిర్మలా చెప్పారు. 2019 20 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఆశించిన స్ధాయిలోనే ఉందని ఆమె తెలిపారు.

ఐటీ రిటర్న్స్‌లో జరిగే పొరబాట్లకు గతంలో ఉన్నట్టుగా పెద్ద చర్యలు ఉండబోవంటూ భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి. పరిశ్రమలు స్ధాపించేవారికి, ఎగుమతులు చేసేవారికి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత్ తన స్ధానాన్ని కొనసాగిస్తున్నట్టుగా నిర్మలా పేర్కొన్నారు. 2014లో భారత్‌ ర్యాంకు 142 ఉంటే.. 2018లో 77వ ర్యాంక్‌కు చేరుకుందన్నారు. ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా కొత్త పథకం ఎంఈఐఎస్‌ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇది అమల్లోకి వస్తే రూ.50 వేల కోట్లతో ఎగుమతులు పెరిగుతాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మర్చి నెలలో మెగా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నట్టుగా ఆమె వెల్లడించారు . కేంద్రం ఆలోచిస్తున్న విధంగా ఎంఈఐఎస్ పథకం అమల్లోకి వస్తే దీనిద్వారా టెక్స్‌టైల్ పరిశ్రమ వంటి రంగాలతో పాటు ఇతర రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రిర నిర్మలా స్పష్టం చేశారు. సగంలో నిలిచిపోయిన గ‌ృహ నిర్మాణాలకు సంబంధించి ఆర్దిక సాయం కింద కేంద్ర రూ.10 వేలకోట్లు విడుదల చేస్తున్నామని ఆర్థికమంత్రి తెలిపారు.