గృహ నిర్మాణాలకు రూ.10 వేల కోట్లు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. నిర్మాణ దశలోనే సగంలో నిలిచిపోయిన గృహాలకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించింది. దీనికోసం రూ.10 వేలకోట్లు ఇవ్వనున్నట్టు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. గృహనిర్మాణ, ఎగుమతి రంగాల్లో ఆర్ధిక వృద్ధిపై మంత్రి నిర్మల సీతారామన్ అనేక చర్యలు ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న గృహనిర్మాణ ప్రాజెక్టులకు నిధులు విస్తరించడానికి రూ. […]

గృహ నిర్మాణాలకు రూ.10 వేల కోట్లు  : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 6:20 PM

అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. నిర్మాణ దశలోనే సగంలో నిలిచిపోయిన గృహాలకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించింది. దీనికోసం రూ.10 వేలకోట్లు ఇవ్వనున్నట్టు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. గృహనిర్మాణ, ఎగుమతి రంగాల్లో ఆర్ధిక వృద్ధిపై మంత్రి నిర్మల సీతారామన్ అనేక చర్యలు ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న గృహనిర్మాణ ప్రాజెక్టులకు నిధులు విస్తరించడానికి రూ. 10 వేల కోట్లను ప్రత్యేక విండో ద్వారా సమకూర్చుతామని మంత్రి తెలిపారు. ఈ విధంగా చేయడం ద్వారా సగంలోనే ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఈ నిధులను ప్రభుత్వంతో పాటు బయటనుంచి కూడా సేకరించనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఇది నాన్ ఎన్‌పీఏ, నాన్ ఎన్‌సీఎల్టీ కింద వర్తింప చేస్తామన్నారు.

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా గృహనిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇప్పటికే సగంలో ఆగిపోయిన నిర్మాణాలు గానీ, లేక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఉద్యోగులకు కేంద్రం నిర్ణయం ప్రోత్సహించేలా ఉందంటూ ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. హౌసింగ్ యూనిట్ల నిర్మాణంపై ప్రత్యేక విండోను ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బడ్జెట్‌లో గృహ నిర్మాణం నిమిత్తం రూ.45 లక్షలు వరకు రుణం తీసుకున్న వారికి ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తూ కేంద్రం ప్రకటించింది. తాజాగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ వడ్డీరేటుతో గృహరుణాలు పొందే వీలు కలిగింది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు