NHAI Scheme: హైవేపై మురికిగా ఉన్న టాయిలెట్ ఫోటోను పంపి రూ.1000 గెలుచుకోండి.. ఎలాగంటే..
NHAI Scheme: స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రోత్సహించడానికి NHAI ఒక కొత్త చొరవను ప్రారంభించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కొత్త చొరవను ప్రారంభించిన తర్వాత ఎవరైనా ప్రయాణీకుడు హైవేపై ప్రయాణించేటప్పుడు పబ్లిక్ టాయిలెట్ మురికిగా కనిపించి, దాని..

NHAI Scheme: మురికి కారణంగా ప్రజలు హైవేలపై ప్రయాణించేటప్పుడు పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించకుండా ఉంటారు. హైవేలపై నిర్మించిన టాయిలెట్లకు వెళ్ళే ముందు ప్రజలు వందసార్లు ఆలోచిస్తారు. అందుకే స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రోత్సహించడానికి NHAI ఒక కొత్త చొరవను ప్రారంభించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కొత్త చొరవను ప్రారంభించిన తర్వాత ఎవరైనా ప్రయాణీకుడు హైవేపై ప్రయాణించేటప్పుడు పబ్లిక్ టాయిలెట్ మురికిగా కనిపించి, దాని గురించి NHAIకి తెలియజేస్తే ఆ వ్యక్తికి 1000 రూపాయల బహుమతి లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్!
FASTag రీఛార్జ్ రూపంలో రూ.1,000 రివార్డ్ లభిస్తుంది. ఈ దేశవ్యాప్తంగా పథకం అక్టోబర్ 31, 2025 వరకు కొనసాగుతుంది. ఈ చొరవను ప్రారంభించడంలో NHAI లక్ష్యం ప్రయాణికులకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలను అందించడం, పరిశుభ్రతను కాపాడుకోవడం. ప్రతి నివేదిక AI, మాన్యువల్ ధృవీకరణ ద్వారా ధృవీకరించబడుతుంది.
ఇలా చేయండి:
- మురికి టాయిలెట్ల గురించి ఫిర్యాదు చేయడానికి మీరు మీ ఫోన్‌లో RajmargYatra యాప్ తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- దీని తరువాత మురికి టాయిలెట్ స్పష్టమైనదిగా ఉండాలి. అలాగే ఫోటోపై తేదీ, సమయం తప్పకుండా ఉండాలి. అప్పుడు ఆ ఫోటోను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
- ఫోటోను అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు మీ పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఖచ్చితమైన స్థానం, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మీ సమాచారం ధృవీకరిస్తే NHAI మీ ఫాస్టాగ్‌కు రూ.1,000తో రీఛార్జ్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: Bank Holidays: అక్టోబర్ నెల పండగ సీజన్.. 11 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజు అంటే..
వీటికి బహుమతి వర్తించదు:
- ఈ పథకం NHAI నిర్మించి నిర్వహించే టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది. పెట్రోల్ పంపులు, తినుబండారాలు లేదా ఇతర ప్రజా సౌకర్యాల వద్ద ఉన్న టాయిలెట్లకు ఇది వర్తించదని గుర్తించుకోండి.
- ఈ పథకం కాలంలో ప్రతి VRN (రిజిస్ట్రేషన్ నంబర్) ఒక రివార్డుకు మాత్రమే అర్హులు.
- ఒకే టాయిలెట్ గురించి చాలా మంది ఫిర్యాదు చేస్తుంటే, మొదట సరైన నివేదిక ఇచ్చిన వ్యక్తికి మాత్రమే రివార్డులు అందుతాయి.
- ఫోటో తప్పనిసరిగా ఒరిజినల్ అయి ఉండాలి. యాప్ ద్వారా తీయాలి. నకిలీ లేదా గతంలో నివేదించబడిన ఏవైనా ఫోటోలు ఉంటే తిరస్కరిస్తారు. అందుకే మీరు తీసిన ఫోటోపై సమయం, తేదీ తప్పకుండా ఉండాలి.
ఇది కూడా చదవండి: BSNL Annual Plan: ఈ చౌకైన రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అక్టోబర్ 15 వరకు మాత్రమే.. మిస్ కాకండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








