AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Vehicle-One FASTag: ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్..

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) టోల్ కనెక్షన్ విధానంలో కీలక మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన మాదిరిగానే 'ఒక వాహనం, ఒకే ఫాస్టాగ్ ' విధానాన్ని తీసుకొచ్చింది. ఇది 2024, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో బహుళ ఫాస్టాగ్ ల వినియోగం ఇక కుదరదు. అంటే ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

One Vehicle-One FASTag: ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్..
Fastag
Madhu
|

Updated on: Apr 11, 2024 | 4:53 PM

Share

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) టోల్ కనెక్షన్ విధానంలో కీలక మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన మాదిరిగానే ‘ఒక వాహనం, ఒకే ఫాస్టాగ్ ‘ విధానాన్ని తీసుకొచ్చింది. ఇది 2024, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో బహుళ ఫాస్టాగ్ ల వినియోగం ఇక కుదరదు. అంటే ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలన్నమాట. ఒక వాహనానికి ఒకటి కన్నా ఎక్కువ ఫాస్టాగ్ లు, లేదా ఒకటి కన్నా ఎక్కువ వాహనాలకు ఒకటే ఫాస్టాగ్ ఉండేందుకు ఇకపై అనుమతి ఉండదు. పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారుల కోసం గడువును మార్చి చివరి వరకూ పొడిగించగా.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త వన్ వెహికిల్, వన్ ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. దీని వల్ల ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ సామర్థ్యం మెరుగుపడుతుందని, ఫాస్టాగ్ ల దుర్వినియోగం అరికట్డం సాధ్యమవుతుందని, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కూడా ఈ విధానం ఉపకరిస్తుందని ఎన్ హెచ్ఏఐ చెబుతోంది.

ఫాస్టాగ్ అంటే..

మన దేశంలో అమలులో ఉన్న ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ ఈ ఫాస్టాగ్. జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రతి వాహనం కూడా నిర్ధేశిత రుసుమును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ అత్యాధునిక వ్యవస్థను తీసుకొచ్చారు. దీనిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ప్రస్తుతం 8కోట్ల మంది వినియోగదారులు ఈ ఫాస్టాగ్ లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. దీని ద్వారా టోల్ చెల్లింపులు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ల స్టిక్కర్ ను స్కాన్ చేసిన సమయంలో ఫాస్టాగ్ కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. అయితే ఇప్పటి వరకూ ఉన్న కొన్ని సరళతర నిబంధనలతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త విధానం అయిన ఒకే వాహనం.. ఒకే ఫాస్టాగ్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు.

ఒకే వాహనం.. ఒకే ఫాస్టాగ్ లక్ష్యం ఇదే..

‘వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్’ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం ఫాస్టాగ్ దుర్వినియోగాన్ని అరికట్టడమే. ఒకే ఒకే వాహనం కోసం జారీ చేసిన బహుళ ఫాస్టాగ్ నివేదికలు, అలాగే సరైన కేవైసీ లేకుండా ఫాస్టాగ్ లు పంపిణీ అయినట్లు ఆర్బీఐ తెలపడంతో.. ఆ మేరకు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ చర్యను ప్రారంభించింది. అదనంగా, వాహనాల విండ్స్క్రీన్లపై ఫ్యాగ్లను అతికించడంలో వైఫల్యం కారణంగా టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన జాప్యాలు జరుగుతున్నాయి. ఇది తోటి రహదారి వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీనిని కూడా తగ్గించడానికి దీనిని తీససుకొచ్చింది.

కేవైసీ అవసరం..

మార్గదర్శకాలకు అనుగుణంగా ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులను వారి ఫాస్ట్ ట్యాగ్ల కోసం ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్ హెచ్ఏఐ కోరుతోంది . ఒక వేళ మీ ఫాస్టాగ్ కేవైసీ అసంపూర్తిగా ఉంటే మీరు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ లేదా జారీ చేసే బ్యాంక్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ద్వారా నోటిఫికేషన్లను స్వీకరిస్తారు. అప్డేట్ కోసం రిజిస్టర్డ్ కమ్యూనికేషన్ ఛానెళ్లను పర్యవేక్షించాలి.

ఒక ఫాస్టాగ్ మరో వాహనానికి చేయలేరు..

వాహనం ఆర్సీ కాపీ ఆధారంగా ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్లు జారీ అవుతాయి. వేరొక వాహనం కోసం ఫాస్టాగ్ ఉపయోగించే ఏ ప్రయత్నమైనా టోల్ ప్లాజాల వద్ద ఈటీసీ సిస్టమ్ ద్వారా గుర్తించబడుతుంది. దీని వలన ఫాస్టాగ్ ని జారీ చేసిన బ్యాంక్ ‘ బ్లాక్ లిస్ట్ చేస్తుంది. అసౌకర్యాన్ని నివారించడానికి వినియోగదారులు మార్గదర్శకాలను పాటించాలని ఎన్ హెచ్ఏఐ సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..