AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF New Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అంతా ఆటోమేటిక్.. కంపెనీ మారినా ఇబ్బంది లేదు..

సాధారణంగా ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారుతూ ఉంటారు. అలాంటప్పుడు వారి పీఎఫ్ ఖాతాను కూడా కొత్త సంస్థకు బదిలీ చేసుకోవాలి. అందుకోసం ఈపీఎఫ్‌వో కు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు మారిన కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త సంస్థకు ఆటోమేటిక్ గా బదిలీ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులోకి వచ్చింది.

EPF New Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అంతా ఆటోమేటిక్.. కంపెనీ మారినా ఇబ్బంది లేదు..
Epfo
Madhu
|

Updated on: Apr 11, 2024 | 5:24 PM

Share

ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ చందాదారులకు శుభవార్త. ఒక సంస్థ లేదా ఫ్యాక్టరీ నుంచి సంస్థకు బదిలీ అయినప్పుడు ఇక నుంచి పీఎఫ్ ట్రాన్స్ ఫర్ కోసం పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ గా పాత ఖాతా బ్యాలెన్స్ బదిలీ అవుతుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ ఓ) తన ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈ మార్పును తీసుకువచ్చింది.

ఉద్యోగి జీవితానికి భరోసా..

ఒక సంస్థ లేదా ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ ఖాతాలు ఉంటాయి. వీరు ప్రతి నెలా తమ జీతాల నుంచి ఈపీఎఫ్ ఓ కు కంట్రిబ్యూషన్ చెల్లిస్తుంటారు. చెల్లించే మొత్తాన్ని వారికి వచ్చే జీతం ప్రకారం నిర్ణయిస్తారు. యాజమాన్యం కూడా ఉద్యోగి పేరుమీద కొంత కంట్రిబ్యూషన్ చెల్లిస్తుంది. ఉద్యోగం నుంచి రిటైరైన తర్వాత ఆ మొత్తాన్ని ఒకేసారి అందజేస్తారు. అది ఉద్యోగికి జీవితానికి భరోసా అందిస్తుంది.

ఆటోమేటిక్ గా బదిలీ..

సాధారణంగా ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారుతూ ఉంటారు. అలాంటప్పుడు వారి పీఎఫ్ ఖాతాను కూడా కొత్త సంస్థకు బదిలీ చేసుకోవాలి. అందుకోసం ఈపీఎఫ్‌వో కు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు మారిన కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త సంస్థకు ఆటోమేటిక్ గా బదిలీ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులోకి వచ్చింది. దీని ప్రకారం యూఏఎన్ నంబర్ కలిగిన ఖాతాదారుల పీఎఫ్ బ్యాలెన్స్ కొత్త సంస్థలో కేటాయించిన నంబర్ కు ఆటోమేటిక్ గా బదిలీ అవుతుంది.

యూఏఎన్ అంటే ఏమిటి?

ఈపీఎఫ్ చందాదారులైన ప్రతి ఉద్యోగికీ 12 అంకెల నంబర్ ను కేటాయిస్తారు. దానినే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) అంటారు. దీనికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉంటుంది. ఉద్యోగి ఎన్ని సంస్థలకు మారినా యూఏఎన్ మాత్రం పర్మినెంట్ గా ఉంటుంది.

యూఏఎన్ తెలుసుకునే విధానం..

  • ముందుగా ఈపీఎఫ్‌వోకు సంబంధించి యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ కు వెళ్లండి. నౌ యువర్ యూఏఎన్ స్టేటన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ వివరాలను నమోదు చేసిన తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పిన్‌ నంబర్ వస్తుంది.
  • దానికి ఎంటర్ చేయాలి, అనంతరం మీ ఈ-మెయిల్ ఖాతా, మొబైల్ నంబర్‌కు యూఏఎన్ వస్తుంది.

ఫోన్ నంబర్ ద్వారా.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే మీ యూఏఎన్ ను మెసేజ్ చేస్తారు.

నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) చందాదారులకు సంబంధించి పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్ డీఏ) చర్యలు తీసుకుంది. పాస్‌వర్డ్ ఆధారిత వినియోగదారులకు భద్రతను మెరుగుపరచడానికి ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను తీసుకువచ్చింది. చందాదారులు, వాటాదారుల ప్రయోజనాలను రక్షించడం దీని లక్ష్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..