Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను రిజెక్ట్‌ చేశారా..? కారణం ఏంటో తెలుసా?

ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు ఆస్పత్రుల్లో చికిత్సకు అయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే.. ఆరోగ్య బీమా అవసరం. ఇది ఆసుపత్రి ఖర్చుల వల్ల మీరు ఆర్థికంగా చితికిపోకుండా చేస్తుంది. కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి సాధారణ వైరల్ లేదా డెంగ్యూ సోకితే, ఆసుపత్రి బిల్లు 2-3 లక్షలు అవుతుంది. గుండె ఆపరేషన్, లేదా కిడ్నీ మార్పిడి అవసరమైతే ఖర్చు రూ.10 నుంచి 15 లక్షలకు చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా లేకపోతే,

Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను రిజెక్ట్‌ చేశారా..? కారణం ఏంటో తెలుసా?
Rejected Health Insurance Claim
Follow us
Subhash Goud

|

Updated on: Apr 11, 2024 | 4:51 PM

ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు ఆస్పత్రుల్లో చికిత్సకు అయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే.. ఆరోగ్య బీమా అవసరం. ఇది ఆసుపత్రి ఖర్చుల వల్ల మీరు ఆర్థికంగా చితికిపోకుండా చేస్తుంది. కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి సాధారణ వైరల్ లేదా డెంగ్యూ సోకితే, ఆసుపత్రి బిల్లు 2-3 లక్షలు అవుతుంది. గుండె ఆపరేషన్, లేదా కిడ్నీ మార్పిడి అవసరమైతే ఖర్చు రూ.10 నుంచి 15 లక్షలకు చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా లేకపోతే, అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం. ఒక్కోసారి ఆరోగ్య బీమా ఉన్నా.. మీరు దాని ప్రయోజనాన్ని పొందలేరు. ఎందుకంటే బీమా కంపెనీ క్లెయిమ్‌ను చెల్లించడానికి నిరాకరిస్తుంది. ఒక పాలసీదారుగా, మీరు దీనికి కారణాలను తెలుసుకోండి. కొన్ని కారణాల వల్ల ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను కంపెనీ తిరస్కరించవచ్చు. అవేంటో చూద్దాం.

క్లెయిమ్ తిరస్కరణ వెనుక ప్రధాన కారణం రాతపని, డాక్యుమెంటేషన్. వాస్తవానికి, ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేస్తున్నప్పుడు, కొన్ని డాక్యుమెంట్లను సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఫాలో అవ్వాలి. పేపర్‌వర్క్ తో పాటు డాక్యుమెంట్లను సమర్పించడంలో ఏదైనా పొరపాటు జరిగితే దానివల్ల క్లెయిమ్ ను తిరస్కరించవచ్చు. అటువంటప్పుడు, అవసరమైన అన్ని ఫారమ్‌లను సరిగ్గా ఫిల్ చేయాలి. బీమా కంపెనీ అడిగిన వివరాలు అన్నింటినీ సమర్పించండి. డాక్యుమెంట్లు ఆలస్యంగా ఇచ్చినా లేదా ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినా, క్లెయిమ్ ఆగిపోవచ్చు.

క్లెయిమ్‌ను సమర్పించడానికి గడువు తేదీ

ఇవి కూడా చదవండి

క్లెయిమ్‌ను సమర్పించడానికి గడువు తేదీని కూడా గుర్తుంచుకోవాలి. ఆలస్యంగా సమర్పించిన క్లెయిమ్‌ను బీమా కంపెనీ అంగీకరించకపోవచ్చు. ప్రతీ బీమా పాలసీకి క్లెయిమ్ కోసం గడువు ఉంటుంది. ఇది ఆసుపత్రి నుండి డిశ్ఛార్జ్ అయిన 14 నుండి 30 రోజుల వ్యవధిలో ఉండొచ్చు. ఇది బీమా కంపెనీతోపాటు ఆ పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య బీమాలో ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్ అనేది కూడా ఒక ముఖ్యమైన పదం అని గుర్తుంచుకోవాలి. దాదాపు అన్ని ఆరోగ్య బీమా పాలసీలలో, ముందుగా ఉన్న వ్యాధులకు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే.. పాలసీ తీసుకోవడానికి ముందు ఉన్న వ్యాధులు. వీటి కోసం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో వ్యాధులు, చికిత్సకు అయ్యే ఖర్చులు కవర్ అవ్వవు. మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధి ఉన్నట్లయితే.. వెయిటింగ్ పీరియడ్‌లో మీకు చికిత్స అవసరమైతే.. దానికోసం మీరు క్లెయిమ్ చేసినా దానిని రిజెక్ట్ చేస్తారు. ముందుగా ఉన్న వ్యాధుల కోసం వెయిటింగ్ పీరియడ్ సాధారణంగా 1 నుండి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది పాలసీ, బీమా కంపెనీ నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది.

అదేవిధంగా, తీవ్రమైన వ్యాధులు, కొన్ని ప్రత్యేక వ్యాధుల కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. ఇది కాకుండా, మీరు కొత్త పాలసీని తీసుకున్నప్పుడు దానిలో 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ఈ సమయంలో ప్రమాదం మినహా, ఇతర క్లెయిమ్‌లకు కవరేజీ ఉండదు. ఆరోగ్య పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, మీకు ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితి గురించి నిజాయితీగా బీమా కంపెనీకి తెలియజేయండి.

పాలసీ గడువు చూస్తే..

పాలసీ గడువు చూస్తే.. ఆరోగ్య బీమా పాలసీ సాధారణంగా ఒక సంవత్సరం పాటు చెల్లుబాటవుతుంది. మీ పాలసీ గడువు ముగిసినట్లయితే దాని వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది ల్యాప్స్ అవుతుంది. పాలసీ గడువు ముగిసిన తర్వాత మీరు క్లెయిమ్ చేస్తే దానిని తిరస్కరిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అమల్లో ఉందో చూసుకోవడం, సమయానికి దాన్ని రెన్యువల్ చేయడం చాలా ముఖ్యం.

బీమాలో కవరేజీ 

ఆరోగ్య బీమాలో మినహాయింపులను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. వాస్తవానికి, ఆరోగ్య బీమా పాలసీల్లో.. కొన్ని చికిత్సలు లేదా శస్త్రచికిత్సలకు కవరేజీ ఉండదు. కాస్మెటిక్ లేదా ప్లాస్టిక్ సర్జరీ, లింగ మార్పిడి చికిత్స… రాక్ క్లైంబింగ్, మోటార్ రేసింగ్, గుర్రపు పందెం వల్ల కలిగే గాయాలకు చికిత్స, గ్లైడింగ్, స్కూబా డైవింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొనడం ద్వారా అయ్యే గాయాలకు ట్రీట్ మెంట్.. మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాల నుండి బయటపడేందుకు చేసే చికిత్స.. సంతానలేమికి సంబంధించిన ఖర్చులు వంటివి చాలా వరకు ఆరోగ్య పాలసీలలో కవర్ అవ్వవు. మీరు వీటికి సంబంధించిన క్లెయిమ్ చేస్తే దానిని రిజెక్ట్ చేస్తారు. పాలసీలో ఏ చికిత్సలు కవర్ అవ్వవు అని తెలుసుకోవడానికి, దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లోని ‘మినహాయింపు నిబంధన’ చదవండి.

ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు..

ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, బీమా కంపెనీ మీ నుండి వైద్య చరిత్ర, జీవనశైలి, ధూమపానం లేదా మద్యపానం వంటి చెడు అలవాట్లు గురించి ముఖ్యమైన సమాచారాన్ని అడుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి, సరైన సమాచారాన్ని బీమా కంపెనీకి అందించాలి. మీరు బీమా క్లెయిమ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఈ సమాచారాన్ని కంపెనీకి ముందుగా చెప్పకుండా ఉంటే.. వాళ్లు మీ క్లెయిమ్ ను తిరస్కరించవచ్చు.

బీమా కవరేజీ ఎంత ఉండాలి?

ఆరోగ్య బీమా ఎంత ముఖ్యమో.. బీమా కంపెనీకి మీ గురించి నిజం చెప్పడం కూడా అంతే ముఖ్యం. తమ ఆరోగ్య బీమా ప్లాన్‌కు సరైన కవరేజ్ ఎంతై ఉండాలి అనేది చాలా మందికి డౌట్. నిజానికి దీని కోసం ప్రజలందరికీ వర్తించే ఏ ఒక్క ప్రత్యేక నియమం లేదు. ఆరోగ్య కవరేజ్ పరిమాణం అనేది.. మీ వయస్సు, కుటుంబ వైద్య చరిత్ర, మీరు చికిత్స చేయించుకోవాలనుకుంటున్న ఆసుపత్రి.. ఇలా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం సమయంలో, మీకు కనీసం రూ.10 లక్షల కవరేజ్ ఉండాలి. చిన్న వయసులో హెల్త్ పాలసీని కొనుగోలు చేస్తే తక్కువ ప్రీమియం చెల్లించాలి. ఎందుకంటే చిన్న వయసులో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తక్కువ.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!