AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NHAI: మొబైల్‌లోనే టోల్ పాస్ పొందవచ్చు.. వాహనదారులకు కేంద్రం అదిరిపోయే సూపర్ న్యూస్..

టోల్ ప్లాజాల వద్ద నివసించే ప్రజలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది. రాజమార్గ యాత్ర యాప్‌లో లోకల్ పాస్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. మీరు టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలో నివసిస్తుంటే ఆటోమేటిక్‌గా ఇది వాహనదారుడిని ధృవీకరిస్తుంది. అనంతరం డిజిటల్ పాస్ జారీ చేస్తోంది.

NHAI: మొబైల్‌లోనే టోల్ పాస్ పొందవచ్చు.. వాహనదారులకు కేంద్రం అదిరిపోయే సూపర్ న్యూస్..
Toll Gate
Venkatrao Lella
|

Updated on: Jul 21, 2026 | 3:17 PM

Share

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) వాహనదారులకు ఊరట కలిగించింది. ఇంటి నుంచే డిజిల్ లోకల్ పాస్ పొందేలా కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల టోల్ ప్లాజాల సమీపంలో 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు యాప్ నుంచే డిజిటల్ లోకల్ పాస్ పొందవచ్చు. ఈ పాస్ నెల రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ పాస్ ద్వారా టోల్ ప్లాజాల సమీపంలో నివసించే నివాసితులు ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయవచ్చు. టోల్ ప్లాజాల సమీపంలో ఉండే వాహనదారుల కోసం ఈ ప్రత్యేక సౌకర్యాన్ని తీసుకొచ్చారు. రాజమార్గ యాత్ర యాప్ ద్వారా డిజిటల్ విధానంలో సులువుగా పాస్ పొందవచ్చు. గతంలో తరహాలో టోల్ ప్లాజాల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు.

ఇంటి నుంచే లోకల్ పాస్ తీసుకోవచ్చు..

టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులు “రాజమార్గ యాత్ర” మొబైల్ యాప్‌ ద్వారా ఇంటి నుండే డిజిటల్ లోకల్ పాస్‌ అభివృద్ది చేసుకోవచ్చు. ఈ పాస్ ద్వారా ఒక నెల పాటు సంబంధిత టోల్ ప్లాజా గుండా ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయవచ్చు. గతంలో స్థానిక పాస్ పొందడానికి వాహనదారులు టోల్ ప్లాజాకు వెళ్లి గుర్తింపు, చిరునామా పత్రాలను సమర్పించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకునేది. అంటే పదేపదే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త డిజిటల్ వ్యవస్థతో ఈ మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

ఈ పాస్ ఎలా పనిచేస్తుంది..?

‘రాజ మార్గ్ యాత్ర’ యాప్‌కు ‘లోకల్ పాస్’ ఫీచర్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 (UER-2)పై ఉన్న ముండ్కా-బక్కర్‌వాలా టోల్ ప్లాజా వద్ద ప్రారంభించారు. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర టోల్ ప్లాజాలలో కూడా దీనిని అమల్లోకి తీసుకురానున్నారు. స్థానిక పాస్ అర్హతను నిర్ధారించడానికి GIS ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దరఖాస్తుదారుడు టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో వాస్తవంగా నివసిస్తున్నాడో లేదో ఈ సాంకేతికత ధృవీకరిస్తుంది. దీనివల్ల మొత్తం ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, కచ్చితంగా జరుగుతుంది.

Follow Us