AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare: వర్షాకాలంలో జిడ్డును తొలగించి ముఖాన్ని మెరిపించే న్యాచురల్ ఫేస్ ప్యాక్ ఇవే..

Monsoon Special Skincare: ఎల్లప్పుడూ ముఖం మెరుస్తూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వర్షాకాలం వచ్చే సరికి గాలిలోని తేమ, దుమ్ము కారణంగా చర్మం జిడ్డుగా మారడంతో పాటు అనేక చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదం. దీని వల్ల మెటిమలు, బ్లాక్‌హెడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈ సమస్యలన్నీ సహజంగా తొలగిపోయి ముఖం కాంతివంతగా మెరవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Anand T
|

Updated on: Jul 21, 2026 | 3:15 PM

Share
వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు మీకు ఖరీదైన మేకప్ కిట్స్ అవసరం లేదు.మన వంటిట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలతోనే మీరు న్యాచురల్‌గా చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. వాటితో ఫేస్ ఫ్యాక్ తయారు చేసుకొని వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ముఖం అందంగా మారుతుంది. రెయినీ సీజన్‌లో చర్మ సంరక్షణ కోసం సులభంగా ఇంట్లో తయారు చేసుకునే మూడు ఫేస్ ఫ్యాక్‌ల గురించి తెలుసుకుందాం.

1 / 5
ముల్తానీ మట్టి రోజ్ వాటర్: మీది ఆయిలీ స్కిన్ అయితే ఈ ఫేస్ ప్యాక్ మీరు చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీ చర్మంపై ఉన్న అదనపు అయిల్‌ను పీల్చుకొని చర్మ నిగారింపును పెంచుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌లో వాడే రోజ్ వాటర్  మీ చర్మాన్ని చల్లబరిచి ఫ్రెష్‌గా మారుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడానికి  2 టీస్పూన్ల ముల్తానీ, తగినన్ని రోజ్ వాటర్‌ తీసుకొని రెండింటి బాగా కలిపి చిక్కటి పేస్ట్ చేయండి.. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. వారానికి 1 నుండి 2 సార్లు ఇలా చేస్తే.. మీ ఫేస్ నిగనిగలాడాల్సిందే.

2 / 5
శనగపిండిప, పెరుగు ఫేస్ ప్యాక్: శనగపిండి, పెరుగుతో చేసే ఫేస్ ప్యాక్‌ కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది. దీని కోసం, 2 టీస్పూన్ల శనగపిండిని 1 టీస్పూన్ తాజా పెరుగుతో కలపండి. కావాలనుకుంటే అందులో చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి 15 నిమిషాల పాటు అప్లై చేసి, ఆ తర్వాత మసాజ్ చేస్తూ కడిగేయండి. శనగపిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అలాగే పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది.

3 / 5
దోసకాయ, కలబంద జెల్: దోసకాయలో చర్మ ఆరోగ్యానికి కావాలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ దోసకాయ, కలబందం జెల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు సగం దోసకాయను తురిమి, దానికి 1 టీస్పూన్ కలబంద జెల్ యాడ్ చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి 15 నుండి 20 నిమిషాల పాటు అప్లై చేసి, ఆ తర్వాత నీటితో కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి ఉపశమనం కలిగించి, అధిక నూనెను తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
ఇవి గుర్తుంచుకోండి: వర్షాకాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకేంటే రోజుకు రెండుసార్లు తేలికపాటి ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. వీలైనప్పుడల్లా ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి. అలాగే వాతావరణంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఆరోగ్యకరమైన చర్మానికి పుష్కలంగా నీరు త్రాగడం,సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం.

5 / 5
Follow Us