AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tobacco Farmers : పొగాకు రైతులకు బిగ్‌ రిలీఫ్‌.. జీఎస్టీ తగ్గింపుపై ఏపీ సర్కార్ కీలక ముందడుగు!

రాష్ట్రంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదే అంశంపై ఏపీ మంత్రులు తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో చర్చించారు. ప్రస్తుతం ముడిపోగాకుపై అమలు చేస్తున్న 40శాతం జీఎస్టీ కారణంగా చాలా మంది రైతులు నష్టపోతున్నారని.. దీన్ని 28 శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Tobacco Farmers : పొగాకు రైతులకు బిగ్‌ రిలీఫ్‌.. జీఎస్టీ తగ్గింపుపై ఏపీ సర్కార్ కీలక ముందడుగు!
Ap Tobacco Farmers
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 2:41 PM

Share

ఏపీ పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకువెళ్లింది ఏపీ మంత్రులు ఎంపీల బృందం.. ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ముడి పొగాకు (HSN 2401)కు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

జీఎస్టీ పెంపు కారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న FCV పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలని కోరారు. ఈ నిర్ణయం ద్వారా పొగాకు రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు ఉపశమనం లభించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతుల పోటీతత్వం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

ఈ కీలక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస రాజు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బస్తీపాటి నాగరాజు, బీద మస్తానీ రావు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us