AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాకీ వరల్డ్ కప్ 2026కు భారత జట్టు ప్రకటన! పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?

ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే హాకీ ప్రపంచకప్‌ కోసం భారత హాకీ జట్టును ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, 20 మంది సభ్యుల జట్టులో నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కలేదు. పూల్‌-డిలో ఉన్న భారత్ వేల్స్, ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లతో తలపడనుంది.

హాకీ వరల్డ్ కప్ 2026కు భారత జట్టు ప్రకటన! పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
Hockey World Cup 2026
SN Pasha
|

Updated on: Jul 21, 2026 | 3:02 PM

Share

ఆగస్టు 15 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న హాకీ వరల్డ్ కప్ 2026 కోసం ఇండియన్ హాకీ ఫెడరేషన్ మంగళవారం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞుడైన డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వరల్డ్ కప్‌లో జట్టు పరిమాణంపై ఉన్న పరిమితి కారణంగా ఇటీవల ఎఫ్‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌లో ఆడిన నలుగురు ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం దక్కలేదు.

డిఫెండర్ అమన్‌దీప్ లక్రా, మిడ్‌ఫీల్డర్లు రాజ్ కుమార్ పాల్, రబిచంద్ర సింగ్ మొయిరాంగ్‌థెమ్, ఫార్వర్డ్ సెల్వం కార్తీ ఈసారి జట్టుకు దూరమయ్యారు. పూల్-డిలో ఉన్న భారత్ టోర్నీలో ఆగస్టు 15న వేల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో, ఆగస్టు 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కీలక పోరులో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లు భారత జట్టు నాకౌట్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.

గత 2023 హాకీ ప్రపంచకప్‌లో భారత్ నిరాశపరిచి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే విజేతగా నిలిచింది. 1975లో పాకిస్థాన్‌ను ఓడించి తొలిసారి, ఇప్పటివరకు ఏకైక టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 1971లో కాంస్య పతకం, 1973లో రజత పతకం గెలిచింది. ఆ తర్వాత ప్రపంచకప్‌లో మరో పతకాన్ని సాధించలేకపోయింది.

భారత జట్టు

  • గోల్‌కీపర్లు: మోహిత్ హెచ్‌ఎస్, సూరజ్ కర్కెరా.
  • డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్‌దీప్ సివాచ్.
  • మిడ్‌ఫీల్డర్లు: రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలాగే, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్.
  • ఫార్వర్డ్‌లు: దిల్‌ప్రీత్ సింగ్, శిలానంద్ లక్రా, సుఖ్‌జీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, అభిషేక్.

Follow Us