NHAI: నేషనల్ హైవేపై వెళుతున్నారా..? ఒక్క ఫొటో పంపితే నేరుగా అకౌంట్లోకి రూ.వెయ్యి ఫ్రీ.. కేంద్రం సూపర్ ఛాన్స్..
నేషనల్ హైవేపై ప్రయాణించేవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా ఫాస్టాగ్ అకౌంట్లో రూ.వెయ్యి రీఛార్జ్ పొందవచ్చు. జస్ట్ ఒక చిన్న ఫొటోను పంపించడం వల్ల ఈ రివార్డ్ పొందే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలామంది ఈ బెనిఫిట్ పొందారు. ఇదెలా అనేది చూద్దాం.

ప్రయాణికులకు నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా(NHAI) శుభవార్త అందించింది. రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక క్యాంపెయిన్ ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. మీరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటే ఉచితంగా రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ పొందవచ్చు. మీరు చేయాల్సింది పెద్ద కష్టమైన పని కూడా కాదు. జస్ట్ ఒక్క చిన్న పని చేస్తే ఈ రివార్డ్ మీ సొంతమవుతుంది. క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ పేరుతో ఓ ప్రత్యేక క్యాంపెయిన్‌ను కేంద్రం గతంలో ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని తాజాగా వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ క్యాంపెయిన్ ద్వారా 429 మంది ప్రయాణికులు ఉచితంగా రూ.వెయ్యి రీఛార్జ్ పొందారు. ఇది ఎలా పొందాలి? అసలు నిబంధనలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
హైవేపై వెళుతున్నప్పుడు ఈ ఒక్క పని చేస్తే చాలు..
మీరు నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్ల వద్ద టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయా..? శుభ్రంగా లేకపోవడం, చెత్తాచెదారంతో ఉండటం లాంటిది మీరు చూశారా..? అయితే మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఫొటో తీసి ఫిర్యాదు చేస్తే చాలు రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ అందిస్తారు. అధికారులు మీ ఫొటోలను ధృవీకరించిన అనంతరం ఈ సొమ్ము మీకు వెంటనే అందుతాయి. ఒక వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌పై ఈ కార్యక్రమంలో ఒక్కసారి మాత్రమే ఈ రీఛార్జ్ పొందవచ్చు. మీరు ఒక్కసారి రివార్డ్ పొందిన తర్వాత మరోసారి పొందలేరన్నమాట. ఈ రీఛార్జ్‌ను వేరేవారికి బదిలీ చేయడం లేదా నగదు రూపంలో మార్చుకోవడం కుదరదు. ఒకే టాయిలెట్‌కు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తే ముందుగా ఫిర్యాదు చేసినవారికి రివార్డ్ అందిస్తారు.
యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం ఎలా..?
-కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజ్ మార్గ్ యాత్ర యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి
-మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి
-టోల్ ప్లాజాల వద్ద శుభ్రంగా లేని టాయిలెట్లు మీకు కనిపిస్తే జియో ట్యాగ్డ్,టైమ్ స్టాంప్ ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేయండి
-ఫిర్యాదు సమంయలో మీ పేరు, టోల్ ప్లాజా లొకేషన్, మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ వివరాలు అందించండి
-మీరు సమర్పించిన ఫొటోలను ఏఐ సాయంతో తొలుత స్క్రీనింగ్ చేస్తారు
-అనంతరం మాన్యువల్‌గా సిబ్బంది పరిశీలిస్తారు
-నిర్ధారించుకున్న అనంతరం మీ వెమికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌కు లింక్ అయిన ఫాస్టాగ్‌కు రూ.వెయ్యి జమ చేస్తారు.
ఈ టాయిలెట్ల ఫొటోలకు మాత్రమే..
ఎన్‌హెచ్ఏఐ నేరుగా నిర్వహిస్తున్న టాయిలెట్లకు మాత్రమే ఈ క్యాంపెయిన్ వర్తిస్తుంది. ఎన్‌హెచ్ఏఐ పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే రివార్డ్ పథకం వర్తిస్తుంది. పబ్లిక్ ప్రదేశాలు, పెట్రోల్ బంకులు, దాబాలు వద్ద ఉండే టాయిలెట్లకు ఇది వర్తించదని కేంద్రం తెలిపింది.
