AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMart: మహిళలు ఎక్కువగా కొనే ఈ వస్తువు డీమార్ట్‌లో ఎందుకుండదు.. ఈ సీక్రెట్ తెలిస్తే..

సామాన్యుడి నెలవారీ బడ్జెట్ నుంచి లగ్జరీ కిరాణా లిస్ట్ వరకు.. ఏది కొనాలన్నా అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు డీమార్ట్. ఉప్పు, పప్పు దగ్గర్నుంచి టీ-షర్టులు, కుర్తీల దాకా అన్నీ దొరికే ఈ రిటైల్ షాపులో మహిళలకు ఎంతో ఇష్టమైన చీరలు మాత్రం ఎక్కడా కనిపించవు.. దేశవ్యాప్తంగా వందల కోట్ల వ్యాపారం చేసే డీమార్ట్, చీరల విక్రయానికి ఎందుకు దూరంగా ఉంటుంది? దీని వెనుక ఉన్న బిజినెస్ లాజిక్ ఏంటి? అనేది తెలుసుకుందాం..

DMart: మహిళలు ఎక్కువగా కొనే ఈ వస్తువు డీమార్ట్‌లో ఎందుకుండదు.. ఈ సీక్రెట్ తెలిస్తే..
DMart Shopping Tips: రిటైల్ మార్కెట్‌లో డిమార్ట్ అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక ముఖ్యమైన కిరాణా దుకాణంగా మారింది. నాణ్యమైన వస్తు ఉత్పత్తులు సరసమైన ధరలకు లభిస్తాయనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అయితే, డిమార్ట్‌లో కేవలం ధరలు తక్కువగా ఉన్నాయని భావించడం సరికాదు. తెలివైన షాపింగ్ వ్యూహాలను అనుసరించడం ద్వారా మరింత తక్కువ డబ్బుకు ఎక్కువ వస్తువులు పొందవచ్చు. దీనికోసం కొన్ని కీలకమైన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Krishna S
|

Updated on: Sep 27, 2026 | 8:25 PM

Share

నిత్యావసర సరుకులు, కిరాణా సామాగ్రి నుంచి బట్టల వరకు బడ్జెట్ ధరల్లో కొనుగోలు చేయాలంటే సామాన్యులకు గుర్తొచ్చే తొలి పేరు డీమార్ట్. గ్రాసరీస్, డిటర్జెంట్లు, కిచెన్ వేర్ నుంచి సాధారణ టీ-షర్టులు, నైటీల వరకు అన్నీ లభించే ఈ మెగా స్టోర్‌లో ఒక వస్తువు మాత్రం అస్సలు కనిపించదు. అది ఏంటంటే.. చీరలు .. మీరు సరిగ్గా గమనిస్తే దాదాపు ఏ బ్రాంచ్‌లోనూ చీరల కౌంటర్లు ఉండవు. దేశంలో అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్ కలిగిన డీమార్ట్, భారతీయ సంస్కృతిలో భాగమైన చీరల విక్రయానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వదు? దీని వెనుక బలమైన రిటైల్ మేనేజ్‌మెంట్ వ్యూహం దాగుంది.

వేగంగా అమ్ముడవ్వడం

డీమార్ట్ ప్రైమరీ ఫోకస్ ఎప్పుడూ ఫాస్ట్ మూవింగ్ వస్తువులపైనే ఉంటుంది. స్టాక్ ఎంత త్వరగా షెల్ఫ్ ఖాళీ చేసి క్యాష్‌గా మారితే డీమార్ట్‌కు అంత లాభం. చీరలు ఆ కేటగిరీ కిందకు రావు. ఒక చీర అమ్ముడవ్వడానికి వారాలు, ఒక్కోసారి నెలల సమయం పట్టొచ్చు.

కస్టమర్ సెలెక్షన్ ప్రాసెస్

సాధారణ బట్టలు లేదా వస్తువులను కస్టమర్లు నేరుగా చూసి ట్రాలీలో వేసుకుంటారు. కానీ చీరల కొనుగోలు ప్రక్రియ వేరు. మడతలు తీసి చూడటం, శరీరంపై వేసుకుని చెక్ చేసుకోవడం, కలర్ మ్యాచ్ చేయడం వంటివి ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా సేల్స్ సిబ్బంది ఉండాలి. ఇది డీమార్ట్ తక్కువ ఖర్చుల విధానానికి పూర్తి విరుద్ధం.

రకరకాల డిజైన్లు – డెడ్ స్టాక్ భయం

చీరల్లో వందల రకాల క్లాత్‌లు, డిజైన్లు, ఫ్యాషన్ పోకడలు ఉంటాయి. ఈ సీజన్‌లో ట్రెండ్‌గా ఉన్న మోడల్ వచ్చే సీజన్‌కు పాతబడిపోతుంది. అమ్ముడవకుండా మిగిలిపోయే దుస్తుల వల్ల వచ్చే నష్టాన్ని డీమార్ట్ అస్సలు భరించదు.

ఫ్లోర్ స్పేస్ వ్యాల్యూ

డీమార్ట్‌లో ప్రతి చదరపు అడుగు స్థలానికి ఒక నిర్దిష్టమైన రెవెన్యూ టార్గెట్ ఉంటుంది. చీరల స్టాక్‌ను విస్తారంగా ప్రదర్శించడానికి ఎక్కువ స్థలం కేటాయిస్తే, ఆ స్థలంలో వచ్చే రాబడి తగ్గిపోతుంది. అదే స్థలంలో నిత్యావసరాలు పెడితే నిమిషాల్లో అమ్ముడవుతాయి.

రిటైల్ వ్యాపారంలో ఏది అమ్మాలి అనేదాని కంటే తమ బిజినెస్ మోడల్‌కు సరిపడనిదాన్ని ధైర్యంగా దూరం పెట్టడమే డీమార్ట్ సక్సెస్‌కు అసలు రహస్యం. అందుకే పండుగల సమయంలో లేదా కొన్ని లోకల్ బ్రాంచుల్లో ప్రయోగాత్మకంగా తప్ప, చీరలను డీమార్ట్ శాశ్వత విభాగంగా ఉంచదు.

Follow Us
ప్రతి చిన్నారికి SpaceX లొ షేరు ఇస్తా.. మస్క్ ప్రకటన
ప్రతి చిన్నారికి SpaceX లొ షేరు ఇస్తా.. మస్క్ ప్రకటన
మటన్ ధరలకు ఏమాత్రం తగ్గని నాటు కోడి రేటు.. అయినా కొనుగోళ్లలో జోరు
మటన్ ధరలకు ఏమాత్రం తగ్గని నాటు కోడి రేటు.. అయినా కొనుగోళ్లలో జోరు
భారతదేశ ఆరోగ్య చిత్రం మారుతోందా?
భారతదేశ ఆరోగ్య చిత్రం మారుతోందా?
ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఏర్పాటు చేసే విధానం..
ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఏర్పాటు చేసే విధానం..
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ద్వారకాతిరుమల..
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ద్వారకాతిరుమల..
మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక, సమయం ఇదే
మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక, సమయం ఇదే
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా.. రుచి అదిరిపోతుంది!
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా.. రుచి అదిరిపోతుంది!
'నేను పుట్టాను.. అలసిపోయాను..' బేబీ పోజ్ కు నెట్టింట ఫిదా
'నేను పుట్టాను.. అలసిపోయాను..' బేబీ పోజ్ కు నెట్టింట ఫిదా
ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు సగానికి తగ్గుతుంది!
ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు సగానికి తగ్గుతుంది!
ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..
ఈ జ్యూస్‌ ఆరోగ్యానికి అమృతమే..! అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..