AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 28 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థిక పరిస్థితిలో మార్పులు..మీ రాశి ఫలితాలు ఇలా..

Horoscope Today (September 28, 2026): సోమవారం మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అంచనాలకు మించిన లాభాలు అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు తోబుట్టువులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి శుభవార్తలు, కుటుంబంలో అనుకోని శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

సెప్టెంబర్ 28 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థిక పరిస్థితిలో మార్పులు..మీ రాశి ఫలితాలు ఇలా..
Rashi Phalalu 28 September 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 28, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 28, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మిథున రాశి వారు శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతుంది. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరో గ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రభుత్వోద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక ప్రయత్నాలకు, అదనపు ఆదాయ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బాగా సన్నిహితులైన బంధుమిత్రులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని మిత్రుల సాయంతో సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధువుల కారణంగా ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలున్నా తేలికగా పరిష్కారమవుతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని మరింతగా తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు సంతృప్తికర స్థాయిలో ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగుతాయి. ఇష్టమైన బంధువులు, సన్నిహితుల్ని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల నుంచి సంతోష కరమైన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువర్గం నుంచి శుభ వార్త అందుతుంది. కుటుంబంతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కొనసాగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధువులు లబ్ధి పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెడతారు. పిల్లలు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందు తుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. కొద్ది పాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. కొందరు బంధువులు విమర్శలు చేసే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లకు పనిభారం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ధనపరంగా రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కు వగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అన్ని సమస్యలూ సర్దుకుంటాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశిం చిన సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద అతిగా ఆధారపడే అవకాశం ఉంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరిగే సూచన లున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. అధికారులతో కొద్దిగా ఆచితూచి వ్యవహరిం చడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే అప్రయ త్నంగా ఉద్యోగం లభించే సూచనలున్నాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగాఅండగా నిలబడతారు.

Follow Us