టికెట్ కన్పార్మ్ అవ్వలేదా..? నో టెన్షన్.. ట్రైన్ ఎక్కాక కూడా సీటు పొందే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలు..
రద్దీ సమయాల్లో ట్రైన్లలో టికెట్ పొందటం అనేది చాలా కష్టం. ఇక పండుగలు సమయాల్లో అయితే టికెట్ నెల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రైన్ ఎక్కాక కూడా మీరు సీటు పొందవచ్చు. అయితే ఆర్ఏసీ టికెట్ కలిగి ఉండాలి.

ట్రైన్‌లో సుఖవంతమమైన ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. దీని వల్ల సీటు దొరకదనే టెన్షన్ ఉండదు. రైలు బయల్దేరే సమయానికి వెళ్లి హాయిగా ట్రైన్ ఎక్కి మీ సీటు పొందవచ్చు. అయితే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో ఒక్కొసారి టికెట్లు దొరకడం కష్టమవుతుంది. టికెట్ బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టులోనే ఉంటుంది. ట్రైన్ బయల్దేరే సమాయానికి కూడా కన్పార్మ్ కాకపోవడం వల్ల ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆర్ఏసీ టికెట్ ఉన్నవారు ట్రైన్ బయల్దేరాక కూడా సీటు పొందే అవకాశం ఉంది. టీటీఈని సంప్రదించి ఖాళీగా ఉన్న సీటును పొందవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం.
టీటీఈను సంప్రదించడం బెటర్..
ఆర్‌ఏసీ అంటే రిజర్వేషన్ ఎగనెస్ట్ క్యాన్సిలేషన్ అని అర్థం. అంటే ఎవరైనా ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, ట్రైన్ బయల్దేరే సమయానికి రాకపోయినా ఈ సీటును ఆర్‌ఏసీ టికెట్ ఉన్నవారికి కేటాయిస్తారు. రైలు బయల్దేరాక కన్పార్మ్‌డ్ టికెట్ ఉన్న వ్యక్తి రాకపోతే ఆ సీటును ఆర్‌ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తారు. టీటీఈ దగ్గర హ్యాండ్ హెల్డ్ టెర్మినల్ డివైజ్ ఉంటుంది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత టీటీఈలు ఈ డివైజ్ ద్వారా ప్రయాణికుల హాజరును నమోదు చేస్తారు. రానివారు వివరాలను సిస్టమ్‌లో అప్డేట్ చేస్తారు. ఈ ఖాళీ బెర్త్‌ను ఆర్‌ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తారు. ప్రయాణం మధ్యలో ఖాళీ అయ్యే బెర్త్‌లను ఆర్‌ఏసీ ప్యాసింజర్‌కు కేటాయిస్తారు. ఆర్‌ఏసీ ప్రయాణికులు ఖాళీగా ఉన్న సీటును గుర్తించి టీటీఈని సంప్రదించి బెర్త్ కోరవచ్చు. దీంతో అర్హతలను పరిశీలించి టీటీఈ బెర్త్ కేటాయిస్తారు.
అయితే ఆర్ఏసీ టికెట్ ఉన్నవారు తమ పీఎన్‌ఆర్ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు సీటు కన్పార్మ్ అయితే అక్కడ తెలుస్తుంది. ప్రయాణం మధ్యలో టికెట్ కన్పార్మ్ అయితే మొబైల్‌కు మెస్సేజ్ రాదు ఆటోమేటిక్‌గా మెస్సేజ్ వస్తుందని చాలామంది అనుకుంటారు. ట్రైన్ బయల్దేరాక ఎలాంటి మెస్సే్జ్‌లు అనేవి రావు. టీటీఈని సంప్రదిస్తే ఖాళీగా ఉన్న బెర్త్‌ను ఆర్‌ఏసీ టికెట్ ఉన్నవారికి ప్రయారిటీ ప్రకారం కేటాయిస్తారు. ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ఖాళీగా ఉన్న బెర్త్‌లను చెక్ చేసుకోవచ్చు. తనిఖీ చేసుకున్న అనంతరం సీటు కేటాయించాలని టీటీఈని అభ్యర్థించాలి. ఖాళీగా ఉన్న సీట్లను ఆర్‌ఏసీ ప్రయాణికులకు కేటాయించాలని రైల్వే నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. దీంతో ఈ విధానంలో ట్రైన్ ఎక్కాక కూడా సీటు పొందే అవకాశముంది. అయితే తప్పనిసరిగా సీటు దొరుకుతుందని చెప్పలేం. ప్యాసింజర్ల రద్దీ, టికెట్ క్యాన్సిలేషన్లను బట్టి ఉంటుంది.
