AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tyre Puncture Scam: వెలుగులోకి నయా స్కామ్.. పంక్చర్ పేరుతో మీ జేబుకు చిల్లు

ప్రస్తుత రోజుల్లో ఎదుటివారిని మోసగించి డబ్బును కాజేసే వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా అవసరంలో ఉంటే మనం ఏది చెబితే అది విని డబ్బు ఇస్తారని మన అవసరాన్నే అవకాశంగా తీసుకునే వారు చాలా మంది ఉంటారు. మనం వాడే బైక్ గానీ, కారు గానీ అనుకోని సందర్భంలో పంక్చర్ పడితే ఎటు వెళ్లాలో తెలియక పంక్చర్ షాపును సంప్రదించి ఎంత ఖర్చయినా పంక్చర్ వేపిస్తూ ఉంటారు. అయితే పంక్చర్ సమయంలోనే మోసం చేసే నయా టెక్నిక్ వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పంక్చర్ స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Tyre Puncture Scam: వెలుగులోకి నయా స్కామ్.. పంక్చర్ పేరుతో మీ జేబుకు చిల్లు
Tyre Puncture Scam
Follow us
Srinu

|

Updated on: Jan 26, 2025 | 6:02 PM

ప్రతిరోజూ స్కామర్‌లు సాధారణ ప్రజలను మోసగించడానికి, వారి నుండి డబ్బు సంపాదించడానికి వినూత్నమైన స్కామ్‌లను ప్లాన్ చేస్తారు. తాజాగా కోరేగావ్ పార్క్‌లో కొత్త తరహా టైర్ పంక్చర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మోసానికి ఓ యువకుడు బలి అయ్యి 6500 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇటీవల కాలంలో పూణేలో ఇలాంటి అనేక కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూణే పోలీసులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. పూణేకు చెందిన ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి ఘోర్‌పాడి మీదుగా కల్యాణినగర్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో తన కారు టైర్‌లో గాలి తక్కువగా ఉండడం గమనించాడు. దాంతో ఇక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొంత దూరంలో ఉన్న పంక్చర్ రిపేర్ షాపుకు వెళ్లి పంక్చర్ రిపేర్ చేయించాడు.

ముఖ్యంగా పంక్చర్ రిపేర్ షాప్‌ను సంప్రదించినప్పుడు మెకానిక్ టైర్‌ని తనిఖీ చేసి టైర్‌లో ఒకటి కంటే ఎక్కువ పంక్చర్‌లు ఉన్నందున దాన్ని రిపేర్ చేయడానికి లిక్విడ్ సీలెంట్‌ని ఉపయోగించమని అతనికి సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్క టైరు మాత్రమే పంక్చర్ అయినప్పటికీ నాలుగు టైర్లకు సీలెంట్ చేసుకోవడం ఉత్తమమని సూచించాడు. ఒక లిక్విడ్ సీలెంట్ బాటిల్ ధర రూ.1599గా పరిగణించి నాలుగు లిక్విడ్ సీలెంట్ బాటిళ్లకు మొత్తం రూ.6,500 వసూలు చేశాడు. మొత్తం సంఘటన తర్వాత, బాధితుడు తనకు టైర్లకు అవసరం లేకపోయినా మిగిలిన మూడు టైర్లకు కూడా ఈ లిక్విడ్ సీలెంట్‌ను ఉపయోగించమని మెకానిక్ తప్పుగా సూచించాడని గ్రహించాడు. ఇంకేం చేయలేక సైలెంట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మీ కారు లేదా ఏదైనా ఇతర వాహనం పంక్చర్ అయినట్లయితే, కంగారు పడకూడదు. సరిగ్గా ఏమి జరిగిందో మీరే చూసుకోండి. మీరు దానిని మీరే తనిఖీ చేయడం ఉత్తమం. ఎన్ని పంక్చర్లు ఉన్నాయో లెక్కించాలి
  • మీ వాహనాన్ని నమ్మకం ఉన్న పంక్చర్ రిపేర్ షాప్ వద్ద ఆపి పని చేసే సమయంలో జాగ్రత్తగా చూసుకుని అంత సవ్యంగా నిర్ధారించుకోవాలి. 
  • అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలని తొందరపడి కారులో అదనపు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి.
  • అలాగే పంక్చర్ వేసే ముందే దానికి ఎంత డబ్బు ఖర్చు చెల్లించాలో? అడగాలి. తద్వారా మీరు పని పూర్తయిన తర్వాత అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి