AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastag Rules: మీ ఫాస్ట్‌ట్యాగ్‌ గడువు ముగిసిందా? కేవైసీ చేసుకోవడం ఎలా?

ఆగస్ట్ 1, 2024 నుండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) FASTag వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు ప్రీ-పెయిడ్ ట్యాగ్ సదుపాయం. ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్‌ను నాన్‌స్టాప్‌గా తరలించడానికి వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా..

Fastag Rules: మీ ఫాస్ట్‌ట్యాగ్‌ గడువు ముగిసిందా? కేవైసీ చేసుకోవడం ఎలా?
Fastag
Subhash Goud
|

Updated on: Aug 02, 2024 | 12:26 PM

Share

ఆగస్ట్ 1, 2024 నుండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) FASTag వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు ప్రీ-పెయిడ్ ట్యాగ్ సదుపాయం. ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్‌ను నాన్‌స్టాప్‌గా తరలించడానికి వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా కదిలేందుకు ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీని ప్రవేశపెట్టింది.

కేవైసీలో కీలక మార్పులు:

  1. కేవైసీ అప్‌డేట్: ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులు తమ కేవైసీ వివరాలను అక్టోబర్ 31 వరకు అప్‌డేట్ చేయాలి. మీ ఫాస్ట్‌ట్యాగ్‌లను 3 సంవత్సరాలకుపైగా వినియోగించే వారు కేవైసీ అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి.
  2. ఫాస్టాగ్‌తో లింక్: ఇప్పుడు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌ను ఫాస్టాగ్‌తో లింక్ చేయడం అవసరం. ఫాస్టాగ్ ప్రొవైడర్లు తమ డేటాబేస్‌ను కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. 90 రోజుల్లోగా: కొత్త వాహనాలను కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా ప్రజలు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఫాస్టాగ్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్‌ను కూడా లింక్ చేయాల్సి ఉంటుంది.
  5. ఫోటో అప్‌లోడ్: గుర్తింపు, భద్రతను మెరుగుపరచడానికి, ఫాస్ట్‌ట్యాగ్ ప్రొవైడర్లు ఇప్పుడు వాహనం ముందు వైపు స్పష్టమైన, అధిక నాణ్యత గల ఫోటోలతో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  6. పాత ఫాస్ట్‌ట్యాగ్‌ల భర్తీ: మీరు ఫాస్ట్‌ట్యాగ్‌ తీసుకుని ఐదేళ్లు దాటినట్లయితే దాని స్థానంలో మరో ఫాస్ట్‌ట్యాగ్‌ భర్తీ చేయాల్సి ఉంటుంది.
  7. మొబైల్ నంబర్ లింకింగ్: కమ్యూనికేన్‌లో ఇబ్బందులు లేకుండా సకాలంలో అప్‌డేట్‌లను నిర్ధారించడానికి, ప్రతి ఫాస్ట్‌ట్యాగ్‌ని మొబైల్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి.

ఫాస్ట్‌ట్యాగ్ అనేది భారతదేశం అంతటా ఉన్న టోల్ ప్లాజాలపై ఉన్న అడ్డంకులను తొలగించడానికి సాంకేతికతను ఉపయోగించే వాహనాల కోసం ఒక విప్లవాత్మక ప్రీ-పెయిడ్ ట్యాగ్ సౌకర్యం. ఫాస్ట్‌ట్యాగ్ తీసుకున్న తర్వాత అది వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికిస్తారు. ఫాస్ట్‌ట్యాగ్‌కి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి టోల్ మొత్తాన్ని డెబిట్ అవుతుంది.

వినియోగదారులు టోల్ ప్లాజాలు, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, బ్యాంకులు, పేటీఎం, అమెజాన్, పెట్రోల్ పంపుల నుండి ఫాస్ట్‌ట్యాగ్‌లను కొనుగోలు చేయవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించడం అనేక ప్రయోజనాలతో వస్తుంది. ఇది టోల్‌ప్లాజాల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా చేస్తుంది. అలాగే కాలుష్యం, ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్‌ల KYCని ఎలా పూర్తి చేయాలి?

  • ముందుగా fastag.ihmcl.comకి వెళ్లండి.
  • మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని అప్‌డేట్ చేయడానికి ప్రొఫైల్ విభాగానికి నావిగేట్ చేసి, ‘KYC’ విభాగంపై క్లిక్ చేయండి.
  • అక్కడ అడిగిన వివరాలను పూరించాలి. ఆ తర్వాత అవసరమైన కేవైసీ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయండి.
  • డిక్లరేషన్‌ని తనిఖీ చేసి నిర్ధారించండి.
  • ఆ తర్వాత సమర్పించు ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి, ఆ తర్వాత మీ KYC ధృవీకరణ పూర్తవుతుంది.

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్ సిలిండర్ గురించి ముఖ్యమైన ప్రకటన.. తప్పక తెలుసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి