AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio recharge plan: రూ. 239లకే జియో సరికొత్త ప్లాన్, అపరిమిత కాలింగ్ తో సూపర్ స్పీడ్ ఇంటర్ నెట్.. పూర్తి వివరాలివి..

ఇప్పుడు 5జీ ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దానిలో భాగాంగా ఓ ఆకర్షణీయమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ. 239 రీచార్జ్ పై అపరిమిత కాలింగ్, డేటా సౌకర్యం తోపాటు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లను అందిస్తోంది.

Jio recharge plan: రూ. 239లకే జియో సరికొత్త ప్లాన్, అపరిమిత కాలింగ్ తో సూపర్ స్పీడ్ ఇంటర్ నెట్.. పూర్తి వివరాలివి..
Jio Recharge
Madhu
|

Updated on: Feb 06, 2023 | 1:40 PM

Share

రిలయన్స్ జియో.. తక్కువ కాలంలో వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా రూపాంతరం చెందింది. టెలికాం రంగంలో ఒక సంచలనమే సృష్టించింది. వేగవంతమైన ఇంటర్ నెట్ పాటు, చవకైన ప్లాన్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. 4జీ టెక్నాలజీని అందరికీ చేరువు చేసింది. ప్రస్తుతం అదే పంథాను కొనసాగిస్తోంది. వినియోగదారుల పల్స్ కు అనుగుణంగా అనేక ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో ఆకట్టుకుంటోంది. ఇదే క్రమంలో ఇప్పుడు 5జీ ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దానిలో భాగాంగా ఓ ఆకర్షణీయమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ. 239 రీచార్జ్ పై అపరిమిత కాలింగ్, డేటా సౌకర్యం తోపాటు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లను అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్ని ప్లాన్ ల కంటే ఉత్తమమైనదిగా ఈ ప్లాన్ కనిపిస్తోంది. అసలు ప్లాన్ ఏంటి? దాని పూర్తి ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం..

ప్లాన్ వివరాలు ఇవి..

రూ. 239 పెట్టి రీచార్జ్ చేసుకుంటే మీరు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. దీంతో పాటు, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ ఉచితంగా పంపుకోవచ్చు. ఇప్పుడు డేటా గురించి మాట్లాడితే ఇటీవల దేశంలోని కొన్ని నగరాల్లో జీయో 5జీ నెట్ వర్క్ ని ప్రారంభించింది. అయితే మీరు 5జీ స్పీడ్ తో ఇంటర్ నెట్ ను వినియోగించాలంటే మాత్రం 5జీ ఫెసిలిటీ తో కూడిన రీచార్జ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని రీచార్జ్ చేయాలి. మీకు ఈ రూ. 239 ప్లాన్ లో 5జీ నెట్ లభిస్తుంది. ప్రతి రోజూ 1.5జీబీ ను అందుకోవచ్చు. అంటే మొత్తం 42 జీబీ డేటా అందుతుంది. నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

ఉచిత సబ్ స్క్రిప్షన్..

ఈ రీఛార్జ్‌లో, మీకు అనేక ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా ఇవ్వబడుతుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం. అంటే, మొత్తంగా, ఈ ప్లాన్‌లో మీకు అన్ని సౌకర్యాలు ఇవ్వబడ్డాయి. డేటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది . అప్పుడు దాని వేగం 64Kbps ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరో ప్లాన్..

ఇదే తరహాలో జియో 259 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో కూడా మీకు అపరిమిత కాలింగ్ సౌకర్యం వస్తుంది. దీంతో పాటు, ప్రతిరోజూ 1.5GB డేటా కూడా ఉంటుంది. ఇది కాకుండా, ప్రతిరోజూ 100 SMS కూడా ఉచితంగా పంపుకోవచ్చు. ఈ ప్లాన్ ఒక సంవత్సరం వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్ లో కూడా మీకు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ ఆప్షన్ ఫ్రీగా దొరకుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..