Mutual Funds: నెలకు రూ.99 పెట్టుబడితో సరికొత్త మ్యూచువల్ ఫండ్స్.. ప్రారంభ పెట్టుబడిదారులకు సువర్ణావకాశం
భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. ముఖ్యంగా స్థిరమైన పెట్టుబడుల్లో కాకుండా అధిక ఆదాయం వచ్చే ఇతర వనరుల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆయా వనరుల్లో పెట్టుబడికి పెద్ద మొత్తంలో సొమ్ము కావాల్సి వస్తుండడంతో చిన్న, మధ్యస్థాయి పెట్టుబడిదారులు పెట్టుబడికి వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు చిన్న మొత్తాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు.
భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. ముఖ్యంగా స్థిరమైన పెట్టుబడుల్లో కాకుండా అధిక ఆదాయం వచ్చే ఇతర వనరుల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆయా వనరుల్లో పెట్టుబడికి పెద్ద మొత్తంలో సొమ్ము కావాల్సి వస్తుండడంతో చిన్న, మధ్యస్థాయి పెట్టుబడిదారులు పెట్టుబడికి వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు చిన్న మొత్తాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్‌ను మినహాయించి స్కీమ్‌లలో దాని సిట్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ స్ట్రక్చర్‌కు మార్పులను ప్రకటించింది . ఇప్పుడు పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీను అక్టోబరు 1 నుంచి నెలకు 99 రూపాయలతో ప్రారంభించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది నెలవారీ, త్రైమాసిక ఎస్ఐపీ ఫ్రీక్వెన్సీలకు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
తక్కువ ఎస్ఐపీ మొత్తం మ్యూచువల్ ఫండ్‌లను చిన్న పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఎస్ఐపీ కంట్రిబ్యూషన్‌లు ఆగస్టు 2024లో రూ. 23,547 కోట్ల ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. జూలైలో రూ. 23,331 కోట్లను దాటింది. మొత్తంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు ఆగస్టులో తమ స్థిరమైన వృద్ధిని కొనసాగించి రూ. 38,239 కోట్లను ఆకర్షిస్తున్నాయి. ఇది ప్రధానంగా కొత్త ఫండ్ ఆఫర్‌ల కారణంగా థీమాటిక్ ఫండ్‌ల నుండి బలమైన సహకారం అందించింది. తాజా ప్రవాహం ఈక్విటీ ఫండ్లలో వరుసగా 42వ నెలలో నికర ఇన్‌ఫ్లోలను సూచిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్, వాటి రాబడి
- మిరే అసెట్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 3 సంవత్సరాలలో 18.03 శాతం, గత ఒక సంవత్సరంలో 41.26 శాతంగా ఉంది.
- మిరే అసెట్ మిడ్‌క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 3 సంవత్సరాలలో 23.69 శాతం, గత ఒక సంవత్సరంలో 44.58 శాతంగా ఉంది.
- మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 3 సంవత్సరాలలో 14.58 శాతం, గత ఒక సంవత్సరంలో 35.22 శాతంగా ఉంది.
- మిరే అసెట్ మల్టీక్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ గత ఏడాదిలో 42.79 శాతంగా ఉంది.
- మిరే అసెట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ గత ఏడాదిలో 38.54 శాతంగా ఉంది.
- మిరే అసెట్ ఈఎల్ఎస్ఎస్ పన్ను సేవర్ ఫండ్ డైరెక్ట్ 3 సంవత్సరాలలో 18.27 శాతం, గత ఒక సంవత్సరంలో 42.18 శాతంగా ఉంది.
ఎస్ఐపీ అంటే..?
ఎస్ఐపీ అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే పథకం. దీనిలో పెట్టుబడిదారుడు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను ఎంచుకుని ముందుగా నిర్ణయించిన వ్యవధిలో నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడి నెలవారీ లేదా త్రైమాసికంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఈక్విటీ ఫండ్స్ ఒకటి. ఈక్విటీ ఫండ్ అనేది మ్యూచువల్ ఫండ్ పథకం. ఇది ప్రధానంగా కంపెనీ షేర్లు/స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంది. వాటిని గ్రోత్ ఫండ్స్ అని కూడా అంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి