GT Force: మార్కెట్‌లోకి నయా ఈవీ లాంచ్.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్స్
తాజాగా హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జీటీ ఫోర్స్ భారత మార్కెట్లో కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇప్పుడు ఆఫర్లో ఉన్న కొత్త మోడల్లు జీటీ వెగాస్, టీడీ రైడ్ ప్లస్, జీటీ వన్ ప్లస్ ప్రో, జీటీ డ్రైవ్ ప్రో స్కూటర్ల ధరలు రూ.55,555 నుంచి రూ.84,555 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీటీ ఫోర్స్ విడుదల చేసిన స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఈవీ వాహనాల్లో ఈవీ స్కూటర్లను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీ దగ్గర నుంచి టాప్ కంపెనీలు వరకూ సరికొత్త ఫీచర్లతో స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జీటీ ఫోర్స్ భారత మార్కెట్లో కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇప్పుడు ఆఫర్లో ఉన్న కొత్త మోడల్లు జీటీ వెగాస్, టీడీ రైడ్ ప్లస్, జీటీ వన్ ప్లస్ ప్రో, జీటీ డ్రైవ్ ప్రో స్కూటర్ల ధరలు రూ.55,555 నుంచి రూ.84,555 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీటీ ఫోర్స్ విడుదల చేసిన స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
జీటీ వేగాస్
జీటీ ఫోర్స్ లాంచ్ చేసిన జీటీ వెగాస్ రూ.55,555 ఎక్స్-షోరూమ్. ఎలక్ట్రిక్ స్కూటర్ BLDC మోటార్ మరియు 1.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగిస్తుంది, ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు నుండి ఐదు గంటలు పడుతుంది. ఇది స్లో-స్పీడ్ స్కూటర్ కాబట్టి గరిష్ట వేగం గంటకు 25 కిమీకి పరిమితం చేయబడింది. GT ఫోర్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది.
జీటీ రైడ్ ప్లస్
జీటీ రైడ్ ప్లస్ తక్కువ-స్పీడ్ స్కూటర్. కాబట్టి ఇది గరిష్టంగా 25 కిలో మీటరల్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ.65,555 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. బ్యాటరీ ప్యాక్ 2.2 కేడబ్ల్యూహెచ్ యూనిట్‌తో వచ్చే ఈ స్కూటర్ 95 కిమీ పరిధిని అందిస్తుంది జీటీ రైడ్ ప్లస్ 680 ఎంఎం శాడిల్ ఎత్తు, 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 90 కిలోల కర్బ్ బరువును కలిగి ఉంది.
జీటీ వన్ ప్లస్ ప్రో
జీటీ వన్ ప్లస్ ప్రో రూ.76,555 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీల రైడింగ్ రేంజ్ ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.
జీటీ డ్రైవ్ ప్రో
జీటీ డ్రైవ్ ప్రో జీటీ ఫోర్స్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ధర రూ.84,555 (ఎక్స్- షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్‌లో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగిస్తుంది. ఈ స్కూటర్ క్లెయిమ్ చేసిన రైడింగ్ రేంజ్ 110 కిలోమీటర్లు. బీఎల్‌డీసీ మోటార్ ఉంది. ఈ స్కూటర్ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







