AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? కేంద్రం కొత్త రూల్స్.. ఇక నుంచి అలాంటి మోసాలు ఉండవ్..

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేస్తున్నారా.. డిస్కౌంట్ల పేరుతో మోసపోతున్నారా.. అయితే ఇక నుంచి అలాంటివి చెల్లవు. కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌కు కఠిన నిబంధనలు విధించింది. ఇక నుంచి కస్టమర్లను మోసం చేసే పద్దతులకు చెక్ పడనుంది. కొత్త రూల్స్ ఏంటంటే..

Shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? కేంద్రం కొత్త రూల్స్.. ఇక నుంచి అలాంటి మోసాలు ఉండవ్..
Ecommerce
Venkatrao Lella
|

Updated on: Sep 12, 2026 | 7:50 AM

Share

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో డిస్కౌంట్లు, డార్న్ ప్యాటర్న్స్‌కు సంబంధించి జరిగే మోసాలకు చెక్ పెట్టేందుకు కఠిన రూల్స్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు, మోసపురిత మార్గాలతో కస్టమర్లను మోసం చేయడం కుదరదు. డిస్కౌంట్ల పేరుతో చేసే మోసాలకు కూడా చెక్ పడనుంది. కన్యూమర్ ప్రొటెక్షన్(ఈ-కామర్స్) రూల్స్ 2020కి కేంద్రం సవరణలు చేసింది. అనంతరం కన్యూమర్ ప్రొటెక్షన్(ఈ-కామర్స్) 2026 పేరుతో కేంద్రం రూల్స్‌ను కేంద్రం నోటిఫై చేసింది. దీనికి సంబంధించి తాజాగా అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

రూల్స్‌లో అసలు ఏమున్నాయంటే..?

-ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లో ఏదైనా వస్తువుపై డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు.. ఇప్పుడు ఎంత తగ్గించారు..? ఇంతకముందు ధర ఎంత ఉంది? అనే విషయాలను స్పష్టంగా పొందుపర్చాలి

-వస్తువు ధరలను పెంచి డిస్కౌంట్ ఇస్తున్నట్లు మోసానికి పాల్పడకూడదు. 30 రోజుల్లో వస్తువు అమ్ముడైన అత్యల్ప ధరనే ప్రయల్ ప్రైస్‌గా పరిగణించాల్సి ఉంటుంది

-యూజర్లు వెతికే క్వెరీలకు సంబంధం లేకుండా సెర్చ్ ఫలితాలను తారుమారు చేయూకూడదు

-స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్ యూజర్లకు స్పష్టంగా తెలిసేలా స్పెషల్ లేబుల్స్ వేయాలి

-డార్క్ ప్యాటర్న్స్ మోసాలకు పాల్పడకూడదు

-ఈ రూల్స్ అన్నీ పాటిస్తున్నట్లు ఈ-కామర్స్ కంపెనీలు సొంతగా ఆడిట్ నిర్వహించి సర్టిఫికేట్లు వెబ్‌సైట్లో పొందుపర్చాలి

-ఇక ఎక్స్‌ఫైరీ, రిటర్న్స్, రీఫండ్లు, వారంటీలు, డెలివరీ ఛార్జీలు వంటి వాటిని ముందుగా తెలపాలి

-ఇక దిగుమతి చేసుకునే వస్తువులకు సంబంధించి ఏ దేశంలో తయారైంది..? దిగుమతిదారుడి వివరాలు ఏంటి? అనేది పొందుపర్చాలి

-యూజర్ల వ్యక్తిగత డేటాను ఈ-కామర్స్ కంపెనీలు ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు

-ఫ్లాట్‌ఫామ్‌తో సంబంధం లేని సర్వీసుల కోసం అదనపు ఫీజులు వసూలు చేయకూడదు

-ఇ-కామర్స్ కంపెనీలు తప్పనిసరిగా నేషనల్ కన్సూమర్ హెల్ప్ లైన్ సిస్టమ్‌తో లింక్ కావాల్సి ఉంటుంది

ఈ-కామర్స్ వెబ్‌సైట్లపై ఫిర్యాదుల వెల్లువ

2025లో ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌కి సంబంధించి 17.71 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అయితే దాదాపు 5.11 లక్షల ఫిర్యాదులు ఈ-కామర్స్‌కి సంబంధించినవి ఉన్నాయి. యూజర్లు ఫిర్యాదు చేసినప్పుడు గ్రీవెన్స్ అధికారి వద్ద నమోదైన రికార్డు కాపీని అందించాలి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు పాటించకపోతే ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై చర్చలు తీసుకుంటారు. ప్రతీ ఫ్లాట్‌ఫామ్ తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వీటిని అమలు చేసేందుకు ఈ-కామర్స్ వెబ్ సైట్లకు డిసెంబర్ 31 వరకు సమయం ఇచ్చింది.

Follow Us