AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise : ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదు.. ఫ్యాన్స్‏కు షాకిచ్చిన నాని..

ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ విడుదల చేయబోమని నాని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ చిత్ర నిర్మాణంలో ఆలస్యాలు, పరిమిత సమయం కారణంగా సినిమా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర భాషల్లోనూ తెలుగు ప్రేక్షకులకు లభించిన అనుభూతిని అందించాలనే తమ లక్ష్యమని నాని పేర్కొన్నారు.

The Paradise : ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదు.. ఫ్యాన్స్‏కు షాకిచ్చిన నాని..
Nani
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2026 | 7:48 AM

Share

మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాని కాంబో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. నటుడు నాని తన తాజా చిత్రం ది ప్యారడైజ్ ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం నిర్వహించిన పెస్ మీట్ లో నానితోపాటు డైరెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నాని ఒక అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు ట్రైలర్ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను నాని వివరంగా తెలియజేశారు. ది ప్యారడైజ్ సినిమా నిర్మాణంలో కొన్ని ఆలస్యాలు జరిగాయని, దీనివల్ల సినిమాను విడుదల చేయడానికి అందుబాటులో ఉన్న సమయం చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. నాని మాట్లాడుతూ “అద్దిరిపోయే ట్రైలర్ ఇవ్వాలంటే నాలుగు రోజులు అన్ని పనులు పక్కన పెట్టేసి శ్రీకాంత్, అనిరుధ్ అందరూ ట్రైలర్ మీద పని చేయాల్సి వస్తుంది. ఇది ముఖ్యమా? సినిమా ముఖ్యమా? అంటే ఈ సమయంలో, తప్పనిసరి పరిస్థితుల్లో, మాకు కూడా ఇష్టం లేదు. మంచి ట్రైలర్ కట్ చేయాలని ఉంది, కానీ తప్పనిసరి పరిస్థితిలో టీం అందరం కలిసి ఈ డెసిషన్ తీసుకున్నాం. ప్యారడైజ్కి ట్రైలర్ ఉండదు” అని వెల్లడించారు. సినిమా విజన్, నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దర్శకుడు శ్రీకాంత్ ఓడెల విజన్‌ను థియేటర్లలో భారీ స్థాయిలో అందించడం తమ లక్ష్యమని నాని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. చివరకు చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.. ప్రేమ కన్నీళ్లు..

ది ప్యారడైజ్ ఒక తెలుగు చిత్రమైనప్పటికీ, నాని ఇతర భాషల్లో కూడా దీనిని అత్యుత్తమ నాణ్యతతో విడుదల చేయడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. గతంలో తాను నటించిన చిత్రాలకు అనుసరించిన విధానాన్నే ప్యారడైజ్ విషయంలోనూ పాటిస్తున్నానని చెప్పారు. “రేపు ప్యారడైజ్ సినిమా చూసినవాళ్ళు ఎవరైనా సరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు… మన ఆడియన్స్ ఫీల్ అయినట్టు సినిమా చూసి… ఫీల్ అవ్వకుండా ఉండకూడదు. అంటే వాళ్ళు ఈ డబ్బింగ్ వర్షన్ బాగాలేదనో ఇంకోటో బాగాలేదనో అనకూడదు. ప్యారడైజ్ తెలుగు ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చిందో వేరే లాంగ్వేజ్ వాళ్ళకి కూడా అదే ఎక్స్పీరియన్స్ ని ఇవ్వాలి” అని ఆయన పేర్కొన్నారు. డబ్బింగ్, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చూసుకుంటామని నాని హామీ ఇచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Allari Naresh: అతడు ఒక కంప్లీట్ యాక్టర్.. డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అద్భుతంగా చేస్తాడు.. అల్లరి నరేష్.

తన కెరీర్ ఎంపికల గురించి కూడా నాని ప్రస్తావించారు. దసరా తర్వాత హాయ్ నాన్న, ఆ తర్వాత హిట్-3, ది ప్యారడైజ్, ప్రస్తుతం బ్లడీ రోమియో వంటి విభిన్న చిత్రాలను ఎంచుకోవడంపై కొంతమందికి సందేహాలు ఉండవచ్చని ఆయన అంగీకరించారు. తాను ఒకే విధమైన పాత్రలకు పరిమితం కాకుండా, ప్రతిసారీ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని స్పష్టం చేశారు. “నాని ఎప్పటికీ అటు వెళ్ళడండి. ఐ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ విత్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ యామ్ డూయింగ్” అని ఆయన హామీ ఇచ్చారు. తన తదుపరి సినిమా ప్రకటన విడుదలైనప్పుడు ఈ సందేహాలన్నీ తీరిపోతాయని, తన కెరీర్ పట్ల పూర్తి స్పష్టత వస్తుందని నాని తెలియజేశారు. ది ప్యారడైజ్ పట్ల భారీ అంచనాలు నెలకొన్న ఈ నేపథ్యంలో, ట్రైలర్ లేకపోయినా సినిమా విడుదలపై ఉన్న నమ్మకాన్ని నాని మాటలు తెలియజేస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

ఎక్కువమంది చదివినవి : Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..

Follow Us