Ind vs Afg T20I: భారత్-ఆఫ్ఘన్ టీ20 పోరు కోసం పక్కా ప్లాన్.. వైభవ్ సూర్యవంశీకి చుక్కలు చూపించిన బుమ్రా
Ind vs Afg T20I: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌లో జస్ప్రీత్ బుమ్రా ఫుల్ స్పీడ్‌తో బౌలింగ్ చేశాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పదునైన యార్కర్లు, వేగంతో ఇబ్బంది పెట్టాడు. నితీష్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశ్ ఠాకూర్ కూడా ఆకట్టుకున్నారు. ఢిల్లీ టీ20కు తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది.

Ind vs Afg T20I: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో ఫుల్ జోష్‌లో కనిపించాడు. తన బౌలింగ్ స్పీడుతో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి చుక్కలు చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రా, నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించి నేరుగా జట్టుతో చేరాడు. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా తన పూర్తి రన్-అప్‌తో బౌలింగ్ చేసి సత్తా చాటాడు. పదునైన యార్కర్లు, మెరుపు వేగంతో విసిరిన బంతులు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాయి. శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ వంటి సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
వైభవ్ సూర్యవంశీకి ఎదురైన సవాల్
ఈ ప్రాక్టీస్ సెషన్‌లో అందరి కళ్లు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపైనే నిలిచాయి. మిగతా బౌలర్లైన అర్షదీప్ సింగ్, శివమ్ దూబేల బౌలింగ్‌లో వైభవ్ తనదైన శైలిలో షాట్లు ఆడి ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. కానీ, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు దిగగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బుమ్రా కచ్చితమైన లైన్ అండ్ లెంత్ బంతులు, అంతుచిక్కని యార్కర్లతో వైభవ్‌కు అంతర్జాతీయ క్రికెట్ అసలైన రూపం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఈ యువ బ్యాటర్ బుమ్రా ధాటికి ఇబ్బంది పడటం నెట్స్‌లో అత్యంత ఆసక్తికర ఘట్టంగా నిలిచింది.
నితీష్ రెడ్డితో పాటు విజృంభిస్తున్న పేస్ విభాగం
బుమ్రా ఒక్కడే కాకుండా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా తన పూర్తి వేగంతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తన రన్-అప్‌తో పరుగెత్తుకుంటూ వచ్చి ఇషాన్ కిషన్ లాంటి బ్యాటర్లకు షార్ట్ పిచ్ బంతులను సంధించాడు. నితీష్ రెడ్డి చూపుతున్న ఈ దూకుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సరికొత్త ప్రత్యామ్నాయాలను ఇస్తోంది. వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే పూర్తి ఫిట్‌నెస్ సాధించగా, యశ్ ఠాకూర్ కూడా నెట్స్‌లో అద్భుతమైన వేగంతో బంతులు విసిరి పోటీని మరింత పెంచేశారు.
ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!
ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై కసరత్తు
బౌలర్లంతా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో రాబోయే మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం కెప్టెన్, కోచ్‌లకు పెద్ద సవాలుగా మారింది. జస్ప్రీత్ బుమ్రా ఆడేది దాదాపు ఖాయం కాగా, అర్షదీప్ సింగ్ కూడా తోడవనున్నాడు. అయితే నితీష్ రెడ్డి ప్రదర్శన చూశాక అతనికి జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏదేమైనా బుమ్రా తిరిగి పుంజుకోవడం జట్టు బలాన్ని రెట్టింపు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
