AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Twitter CEO: ట్విట్టర్‌కు నూతన సీఈఓ.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎలన్ మస్క్

కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ సీఈఓ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ ట్వీట్ చేసిన మస్క్. ప్రస్తుతం ట్విట్టర్‌కు నూతన సీఈఓ దొరికాడంటూ ఓ ఫొటోను షేర్ చేశారు.

New Twitter CEO: ట్విట్టర్‌కు నూతన సీఈఓ.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎలన్ మస్క్
Elon Musk
Nikhil
|

Updated on: Feb 15, 2023 | 4:00 PM

Share

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌కు నూతన సీఈఓను నియమిస్తూ దాని అధినేత ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మస్క్ ట్విట్టర్‌‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపు వివాదం చాలా రోజులు మస్క్‌ను వెంటాడింది. అయినా మస్క్ అస్సలు తగ్గడం లేదు. కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ సీఈఓ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ ట్వీట్ చేసిన మస్క్. ప్రస్తుతం ట్విట్టర్‌కు నూతన సీఈఓ దొరికాడంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా నూతన సీఈఓ మనిషి కాదు కుక్క. మీరు విన్నది నిజమే. తన పెంపుడు కుక్క ఫోక్లిని సీఈఓ చెయిర్‌పై కూర్చోపెట్టారు. అంతేకాదు దానికి ఓ బ్లాక్ టీ షర్ట్ వేసి దాని ఎడమ వైపు సీఈఓ అని రాసి ఉంది. అయితే ఈ ఫొటో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నా భారతీయులను మాత్రం ఆగ్రహానికి గురి చేస్తుంది. అస్సలు మస్క్ ఆ ఫొటో ఎందుకు షేర్ చేశారు? అని చాలా మంది చర్చించుకుంటున్నారు.

44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న మస్క్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఉద్యోగుల తొలంగింపు మొదలుపెట్టాడు. ముఖ్యంగా టాప్ లెవెల్ ఉన్న ఉద్యోగులను తొలగించాడు. అనంతరం సీఈఓ పోస్ట్ తీసుకుని పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. దీంతో చాలా సంస్థలు తాము ట్విట్టర్‌కు యాడ్స్ ఇవ్వము అని ప్రకటించాయి కూడా. ఈ నేపథ్యంలో నూతన సీఈఓ అంటూ తన పెంపుడు కుక్కను కూర్చోపెట్టి దాని పక్కన కొన్ని ఫైల్స్, ఓ చిన్నల్యాప్ టాప్ పెట్టిన తీరు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. ఓ యూజర్ అయితే చాలా మంచి ఎంపిక అంటూ కామెంట్ చేశాడు. మరో యూజర్ అమేజింగ్ డెసిషన్ అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై మస్క్‌ను భారతీయ యూజర్లు ఏకిపడేస్తున్నారు. పాత సీఈఓ పరాక్ అగర్వాల్‌ను అవమానించేందుకే మస్క్ ఈ ఫొటో షేర్ చేశారని మండిపడుతున్నారు. భారతీయ సంతతికి చెందిన అగర్వాల్ ఏం తప్పు చేశాడు? అని ప్రశ్నిస్తున్నారు. పైగా కొత్త సీఈఓ కంటే మెరుగ్గా పని చేయగలరని ఆశిస్తున్నట్టు కామెంట్ చేయడంపై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..