Nestle: వివాదాల్లో నెస్లే కంపెనీ.. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. విచారణలో షాకింగ్‌ విషయాలు

స్విట్జర్లాండ్ దిగ్గజం నెస్లే మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. 2015లో మ్యాగీకి సంబంధించి కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది. స్విస్ కంపెనీలపై నిఘా పెట్టే వెబ్‌సైట్ 'పబ్లిక్ ఐ' విచారణ తర్వాత ఇప్పుడు ఆ సంస్థ మళ్లీ వివాదంలోకి వచ్చింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు బేబీ ఉత్పత్తుల్లో కంపెనీ భారీ మొత్తంలో చక్కెరను ఉపయోగిస్తుందని నెస్లేపై జరిపిన విచారణలో వెల్లడైంది. ఐరోపా..

Nestle: వివాదాల్లో నెస్లే కంపెనీ.. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. విచారణలో షాకింగ్‌ విషయాలు
Nestle
Follow us
Subhash Goud

|

Updated on: Apr 18, 2024 | 4:00 PM

స్విట్జర్లాండ్ దిగ్గజం నెస్లే మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. 2015లో మ్యాగీకి సంబంధించి కంపెనీ వివాదాల్లో చిక్కుకుంది. స్విస్ కంపెనీలపై నిఘా పెట్టే వెబ్‌సైట్ ‘పబ్లిక్ ఐ’ విచారణ తర్వాత ఇప్పుడు ఆ సంస్థ మళ్లీ వివాదంలోకి వచ్చింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు బేబీ ఉత్పత్తుల్లో కంపెనీ భారీ మొత్తంలో చక్కెరను ఉపయోగిస్తుందని నెస్లేపై జరిపిన విచారణలో వెల్లడైంది. ఐరోపా, బ్రిటన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఈ ఉత్పత్తులను విక్రయించినప్పుడు వాటిలో చక్కెర మొత్తం ఉండదు. ఈ వివాదం తర్వాత కంపెనీ షేర్లలో క్షీణత నెలకొంది. గురువారం ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు 3.5 శాతం పడిపోయాయి. ఇంతకీ ఆ వివాదం ఏంటో తెలుసుకుందాం

నెస్లే స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ సంస్థ, దాని ఉత్పత్తులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు పిల్లల ఆరోగ్యంతో నెస్లే ఆడుకుంటుందా అనేది ప్రశ్న తలెత్తుతోంది. ఇది అంతర్జాతీయ ప్రమాణాల ఉల్లంఘన అని మేం చెప్పడం లేదు. సూచించిన నిబంధనల ప్రకారం, బేబీ మిల్క్, సెరెలాక్ వంటి ఉత్పత్తులకు అదనపు చక్కెరను జోడించడం అనేది ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులను నివారించే లక్ష్యంతో అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే.

అసలు విషయం ఏమిటి?

వాస్తవానికి స్విస్ కంపెనీ పబ్లిక్ ఐ తన ఉత్పత్తులను పరిశోధించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పేద దేశాలలో పిల్లల ఉత్పత్తులకు కంపెనీ ఎక్కువ చక్కెరను జోడిస్తుందని, అభివృద్ధి చెందిన దేశాలలో చక్కెర మొత్తం అస్సలు ఉండదని లేదా అతితక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. అయితే అన్ని నిబంధనలను పాటిస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఈ విషయం పబ్లిక్ ఐ ద్వారా పరిశోధించబడినప్పుడు, కంపెనీ తన ఉత్పత్తులలో చేర్చిన విటమిన్లు, ఖనిజాల వంటి వాటి గురించి ఉత్పత్తిపై సమాచారం ఇస్తున్నట్లు కనుగొన్నారు. కానీ చక్కెర సమాచారం వెల్లడించలేదు.

నెస్లేకి భారత్ పెద్ద మార్కెట్

భారతదేశంలో నెస్లే బేబీ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గినందున ఈ విషయం భారతదేశానికి కూడా ముఖ్యమైనది. గణాంకాల ప్రకారం, 2022 సంవత్సరంలో నెస్లే భారతదేశంలో రూ. 20,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన సెరెలాక్ ఉత్పత్తులను విక్రయించింది. భారతదేశంలో విక్రయించే బేబీ ఉత్పత్తులలో సాధారణంగా 3 గ్రాముల చక్కెర ఉంటుంది. అయితే బ్రిటన్, జర్మనీ, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల గురించి మాట్లాడినట్లయితే, ఇక్కడ చక్కెర మొత్తం జీనో శాతం. WHO ప్రకారం, అధిక చక్కెర ఊబకాయానికి కారణమవుతుంది. ముఖ్యంగా పిల్లలకు చక్కెర ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేయడం వల్ల చిన్నవయసులోనే ఊబకాయం బారిన పడుతున్నారు.

షేర్లు పడిపోయాయి

పబ్లిక్ ఐ ఈ నివేదిక తర్వాత, కంపెనీ షేర్లలో క్షీణత ఉంది. గురువారం మార్కెట్ ప్రారంభమైన తర్వాత నెస్లే షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. నెస్లే ఇండియా షేర్లు 3.39 శాతం క్షీణించి రూ. 2459 వద్ద ట్రేడవుతున్నాయి. గత ఏడాది కాలంగా చెప్పాలంటే నెస్లే ఇండియా షేర్లు దాదాపు 19 శాతం రాబడిని ఇచ్చాయి. బేబీ ప్రొడక్ట్స్‌లో అదనపు చక్కెర ఉన్నట్లు నివేదికల తర్వాత నెస్లే ఇండియా షేర్లు 4 నెలల కనిష్టానికి పడిపోయాయి. భారతదేశం గురించి మాత్రమే చెప్పాలంటే, నెస్లే ఇండియా భారతీయ మార్కెట్ నుండి భారీగా డబ్బు సంపాదిస్తోంది.

నెస్లే బేబీ ప్రొడక్ట్ ఈ దేశాల్లో ప్రసిద్ధి చెందింది

నెస్లే బేబీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఉత్పత్తులకు భారతదేశం ఖచ్చితంగా పెద్ద మార్కెట్. అంతేకాకుండా కంపెనీ ఈ ఉత్పత్తులు లాటిన్ అమెరికా, చైనా, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా, సౌదీ అరేబియాలో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. కంపెనీ మార్కెటింగ్ వ్యూహం గురించి మాడితే.. మధ్యతరగతి జనాభా ఉన్న దేశాల్లో కంపెనీ ఈ ఉత్పత్తులను మరింత దూకుడుగా చేస్తుంది.

నెస్లే ఏం చెప్పిందంటే..

దీనిపై నెస్లే స్పందించింది. ప్రముఖ బేబీ ఫుడ్ బ్రాండ్‌లు – సెరెలాక్ ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల కోసం ఉద్దేశించిన తృణధాన్యం ఒకటి. ఇందులో చక్కెర స్థాయిని తగ్గించే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపింది. ఇందులో యాడ్ చేసిన 30 శాతం షుగర్‌లను తగ్గించినట్లు నెస్లే ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. “మేము బాల్యం కోసం మా ఉత్పత్తుల పోషక నాణ్యతను విశ్వసిస్తాము. అలాగే అధిక-నాణ్యత పదార్థాలను ఉపయోగించడం ప్రాధాన్యతనిస్తాము. గత 5 సంవత్సరాలలో నెస్లే ఇండియా మా శిశు తృణధాన్యాల పోర్ట్‌ఫోలియోలోని వేరియంట్‌పై ఆధారపడి 30% వరకు జోడించిన చక్కెరలను తగ్గించినట్లు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?