Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS Update: ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఆకర్షణీయంగా జాతీయ పెన్షన్‌ పథకం: మంత్రి నిర్మలమ్మ

లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ఆర్థిక మంత్రి..

NPS Update: ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఆకర్షణీయంగా జాతీయ పెన్షన్‌ పథకం: మంత్రి నిర్మలమ్మ
Nirmala Sitharaman
Follow us
Subhash Goud

|

Updated on: Mar 24, 2023 | 3:03 PM

లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం జాతీయ పింఛను పథకానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా అందరికీ వర్తిస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి లోక్‌సభలో మాట్లాడుతూ.. ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన పెన్షన్ అంశంపై చర్చించాలని, ఆర్థిక వివేకాన్ని కొనసాగిస్తూ ఉద్యోగుల అవసరాలను తీర్చే విధానాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. సామాన్య పౌరులకు రక్షణ కల్పించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తానని ప్రకటిస్తున్నాను.. కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించేలా సిద్ధం చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

నిజానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ విషయంలో కేంద్రం, ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల మధ్య పోరు నడుస్తోంది. ఈ రోజుల్లో జాతీయ పెన్షన్ స్కీమ్‌కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినందున ఎన్‌పిఎస్‌కు సంబంధించి కూడా వివాదం ముదురుతోంది. ఆ తర్వాత ఎన్‌పీఎస్‌ను సమీక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

మోదీ ప్రభుత్వం ఎన్‌పీఎస్‌పై కమిటీ వేయడంలో రాజకీయ కోణం కూడా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఓపీఎస్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ అంశం రాజకీయంగా మారుతోంది. ఎన్‌పిఎస్‌ను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయడానికి నిర్ణయించిన కారణం ఇదే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి