Voter ID – Aadhaar Card: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నంబర్‌ లింక్‌ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పనులు జరిగే పరిస్థిత లేదు. అయితే ఇతర డాక్యుమెంట్లన్ని కూడా ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం పదేపదే చెబుతూ వస్తోంది. ఒక్కొక్కటిగా ఆధార్‌ లింక్‌ చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది కేంద్ర..

Voter ID - Aadhaar Card: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నంబర్‌ లింక్‌ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..
Voter Id Aadhaar Card
Follow us

|

Updated on: Mar 23, 2023 | 6:48 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పనులు జరిగే పరిస్థిత లేదు. అయితే ఇతర డాక్యుమెంట్లన్ని కూడా ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం పదేపదే చెబుతూ వస్తోంది. ఒక్కొక్కటిగా ఆధార్‌ లింక్‌ చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం.

దేశంలో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ఆధార్‌ను అన్నింటికి అనుసంధానం చేయాల్సి వస్తోంది. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డును అన్నింటికి అనుసంధానించేలా చర్యలు చేపడుతోంది. ఇక ఓటర్‌ ఐడీ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేయాలి. నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్‌ ఓటర్‌ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఆధార్‌ కార్డు లేకున్నా మరో పది గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకోవచ్చు. వీటిలో.. గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్‌/బ్యాంక్‌ పాస్‌బుక్‌ , ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ విత్‌ ఫొటోగ్రాఫ్‌, సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు విత్‌ ఫొటోగ్రాఫ్‌, అఫీషియల్‌ ఐడెంటిటీ కార్డు, యూనిక్‌ ఐడెంటిటీ ఐడీ కార్డులతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఇప్పుడు ఓటర్‌ ఐడీ కార్డుతో ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేయాలని కూడా సర్క్యూలర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అనుసంధానం గడువు ఏప్రిల్‌ 1, 2023తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం శుభవార్త వినిపించింది. ఈ ఓటర్‌ఐడీ కార్డుతో ఆధార్‌ నంబర్‌ లింక్‌ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఆ గడువును మార్చి 31, 2024 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుఎకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ, మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గత సంవత్సరం జూన్ 17న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ 1తో ఓటర్ ఐడీతో ఆధార్ నంబర్ లింక్​ చేసుకొనే గడువు ముగియనుండటంతో ఇప్పుడు మరోసారి గడువు పెంచుతూ ప్రకటించింది. 2022, ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ కార్డు నంబర్లను సేకరిస్తోంది. గత సంతవ్సరం డిసెంబర్ 12 వరకు 54.32 కోట్ల ఆధార్ కార్డు నంబర్లను సేకరించినట్లు ఎన్నికల కమిషన్ అధికార వర్గాలు తెలిపాయి. కాగా, జనవరి 1, 2023 నాటికి దేశంలో 95 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని ఈసీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఓటర్‌ ఐడీకి ఆధార్‌ నెంబర్‌ ఎలా లింక్‌ చేయాలి?

  • ఎన్నికల సంఘం పోర్టల్‌, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడీలను అనుసంధానం చేయవచ్చు. అలాగే గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఈ ప్రక్రియను చేస్తున్నారు.
  • ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌ ద్వారా: ఈ లింకింగ్‌ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎన్నికల సంఘం పోర్టర్ ద్వారా కూడా చేయవచ్చు. ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌కు వెళ్లాలి. పోర్టల్‌లో మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్‌ చేయాలి. పేరు, పుట్టిన తేదీ మొదలైన ఇతర వివరాలను ఎంటర్‌ చేయాలి. తరువాత మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ ధ్రువీకరణ కోసం ఈ ఓటీపీని నమోదు చేయాలి. దీంతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌ అవుతుంది.
  • SMS ద్వారా: ఈ పని పూర్తి చేసేందుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా చేయవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఈ మెసేజ్‌ను 166 లేదా 51969కి పంపాలి. ECLINK స్పేస్ EPIC నంబర్ స్పేస్ ఆధార్ నంబర్ నమోదు చేసి కూడా లింక్‌ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు