Non-Fungible Tokens: ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి సోదర స్వరకర్తలు సలీం సులైమాన్.. ఈ నాన్-ఫంజిబుల్ టోకెన్‌లంటే ఏమిటో తెలుసా?

ప్రముఖ సంగీత సోదర స్వరకర్తలు సలీం సులైమాన్ ఫేం సలీం మర్చంట్, సులైమాన్ మర్చంట్ సరికొత్త ఒప్పందంలో అడుగుపెట్టారు. వారిరువురూ ఎన్ఎఫ్టీ(NFT) మార్కెట్‌ప్లేస్ కోలెక్షన్‌(Colexion)తో ఒప్పందంపై సంతకం చేశారు.

Non-Fungible Tokens: ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి సోదర స్వరకర్తలు సలీం సులైమాన్.. ఈ నాన్-ఫంజిబుల్ టోకెన్‌లంటే ఏమిటో తెలుసా?
Music Composer Siblings Salim Merchant And Sulaiman Merchant
Follow us

|

Updated on: Dec 04, 2021 | 7:06 PM

Non-Fungible Tokens: ప్రముఖ సంగీత సోదర స్వరకర్తలు సలీం సులైమాన్ ఫేం సలీం మర్చంట్, సులైమాన్ మర్చంట్ సరికొత్త ఒప్పందంలో అడుగుపెట్టారు. వారిరువురూ ఎన్ఎఫ్టీ(NFT) మార్కెట్‌ప్లేస్ కోలెక్షన్‌(Colexion)తో ఒప్పందంపై సంతకం చేశారు. వారికి ప్రత్యేకమైన నాన్-ఫంజిబుల్ టోకెన్ల (NFTలు) ప్రారంభించడానికి ఒప్పందం ఉంది.

ఈ సందర్భంగా కోలెక్షన్ వ్యవస్థాపకుడు, సీఈవో అభయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. డిజిటల్ టోకెన్ ట్రేడ్ విలువ ఆధారిత ప్లాట్ ఫారం, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించడంపై తాము విస్తృతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా కళాకారులు..వారి అభిమానుల మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంపై తాము దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా, డిజిటల్ గా పారదర్శకమైన పర్యావరణ వ్యవస్థను కూడా అందిస్తున్నట్టు చెప్పారు. దీనివలన మనం ప్రత్యేకంగా నిలబడతాం.. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల మొదటి ఎంపికగా నిలుస్తామని అగర్వాల్ అంటున్నారు. ఇక సలీం సులైమాన్ ఫేం అభిమానుల కోసం ఆసక్తికరమైన.. ప్రత్యేకమైన సంగీత టోకెన్లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

ఆసియా ఖండంలోని వినియోగదారులపై దృష్టి సారించిన కోలెక్షన్‌(Colexion) క్రీడలు, క్రికెట్, కళలు, వినోద రంగాలలో ప్రసిద్ధి చెందిన ప్రముఖుల ప్రత్యేకమైన డిజిటల్ టోకెన్‌లను ప్రారంభించడంపై దృష్టి సారిస్తోంది. “కళాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ మ్యూజియంతో కోలెక్షన్‌(Colexion)వస్తోంది. ఇది వినియోగదారులు తమ అభిమాన కళాకారుల గురించి మరింత తెలుసుకునే అవకాశాన్ని అందిస్తుంది. మేము పూర్తి ఎన్ఎఫ్టీ(NFT) పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి వర్చువల్ ఎన్ఎఫ్టీ ట్రంప్ కార్డ్ గేమ్‌లు, ప్లే-టు-ఎర్న్ NFT గేమ్‌లు మరియు మరిన్నింటిని ప్రారంభిస్తాము. ”అని కోలెక్షన్‌(Colexion) సహ వ్యవస్థాపకుడు బిబిన్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.

ఎన్ఎఫ్టీ(NFT) అంటే ఏమిటంటే..

ఎన్ఎఫ్టీ(NFT) అంటే.. నాన్-ఫంజిబుల్ టోకెన్. ఇది బ్లాక్‌చెయిన్ సాంకేతికతపై పనిచేస్తుంది. దీనిగురించి వివరంగా చెప్పుకోవాలంటే.. ఇది పరస్పరం మార్చుకోవడానికి వీలులేని డిజిటల్ యూనిట్. ఇందులో డేటా (ఫోటోలు, వీడియోలు, ఆడియో) డిజిటల్ లెడ్జర్‌లో నిల్వ చేస్తారు. ఇవి సులభంగా పునరుత్పత్తి చేయగల వస్తువులతో అనుసంధానిస్తారు. ఇదంతా ఎందుకు.. మామూలు భాషలో మనం చెప్పుకోవాలంటే.. క్రిప్టోకరెన్సీలా ఇదొక క్రియేటివ్ డేటాకు సంబంధించి డిజిటల్ మార్కెట్. అంటే ఎవరైనా తమ వస్తువును అమ్ముకోవాలంటే మధ్యవర్తి కావాలి. కానీ, ఈ విధానంలో ఆన్లైన్ లోనే తమకు తాముగా తాము తయారుచేసినది ఎదైనా డిజిటల్ రూపంలో అమ్ముకునే అవకాశం ఉంటుంది. కళాకారులు నేరుగా తమ కస్టమర్లతో కనెక్ట్ కాగలుగుతారు. తాము సృష్టించిన దానిని నేరుగా వారికి అమ్ముకోగలుగుతారు. ఇష్టానుసారంగా కాపీ చేసుకునె పరిస్థితికి ఈ విధానం చెక్ పెడుతుంది. బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ని ఎనేబుల్ చేసే సాంకేతికత సంగీత విద్వాంసులకు తమ పనిని ఫంజిబుల్ కాని టోకెన్‌లుగా టోకెనైజ్ చేయడానికి..అదేవిధంగా ప్రచురించడానికి అవకాశాన్ని అందించాయి.

ఇవి కూడా చదవండి: Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం