Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఏడాది జీతం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
రిలయన్స్ సంస్థలకు చైర్మన్‌గా కొనసాగుతున్న 'ముఖేష్ అంబానీ' పదవీకాలం మరో ఐదేళ్లు కొనసాగటానికి వాటాదార్ల ఆమోదం కోరుతున్నట్లు సమాచారం. నిజానికి 224 ఏప్రిల్ 19 నాటికి ఆయన పదవి కాలం పూర్తవుతుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే పదవి 2029 వరకు కొనసాగుతుంది. ఆరు పదుల వయసులో కూడా అపర చాణక్యుడుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న ఈయన 2022లో ధీరూభాయ్ అంబానీ మరణానంతరం చైర్మన్ పదవి పొందారు. ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతూ ఉంది.
ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ముఖేష్ అంబానీ ఒకరు. కొన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి.. ఎన్నో రంగాల్లో విస్తరించి రిలయన్స్ సంస్థను అగ్రగామిగా నిలిపాడు. కొన్ని వేల మందికి ఉద్యోగాలను కల్పించిన ముఖేష్ అంబానీ జీతం కొన్ని కోట్లలో ఉంటుందని అనుకుంటారు.. కానీ.. వాస్తవం మాత్రం దీనికి విరుద్దం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తీసుకుంటున్నజీతం సున్నా.. అంటే మీరు నమ్ముతారా.. ఇది నిజం. ఇండియన్ బిజినెస్ కింగ్ ముఖేష్ అంబానీ ప్రతి నెల వేతనం ఎంత తీసుకుంటారు.. తీసుకుంటే ఎంత తీసుకుంటారు అనే ఉత్సూకత మనందరిలో ఉంటుంది. 2008-09 నుంచి 2019-20 వరకు వేతనం రూ. 15 కోట్లుగా ఉండేది.. అయితే, కోవిడ్ సమయంలో జీతం తీసుకోవడం పూర్తిగా మానేశారు. అందులోనూ 2021లో అయన ఏ మాత్రం జీతం తీసుకోకపోవడం విచిత్రం. జీతం మాత్రమే కాకుండా 2021 నుంచి 2023 వరకు ఎలాంటి అలవెన్సులు తీసుకోలేదని తెలుస్తోందని కంపెనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆ తరువాత జీతం అస్సలు తీసుకోనని బోర్డుకి రిక్వెస్ట్ చేసినట్లుగా వెల్లడించింది. అదే మరో ఏడాది కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
జియో ద్వారా భారతదేశంలో మొబైల్ టెలిఫోన్, బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారంలో విధ్వంసం సృష్టించి.. రిలయన్స్ రిటైల్ ద్వారా దేశ కిరాణా వ్యాపారంలో ముద్ర వేసిన బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇప్పుడు కొత్త ప్రాంతంలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖేష్ అంబానీ ఇప్పుడు దేశంలోని ఎన్‌బీఏసీ రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవలి వార్షిక నివేదిక నుంచి ఈ సమాచారం తెలుస్తోంది. ఆ కంపెనీ అందిచిన నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ ఇప్పుడు తన ఆర్థిక సేవల సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ( జెఎఫ్‌ఎస్‌ఎల్) ద్వారా దేశ బ్యాంకింగ్ రంగంలో తన ఉనికిని చాటుకునేందకు చూస్తున్నారు. జెఎఫ్‌ఎస్‌ఎల్ ద్వారా భారతదేశపు అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ రుణదాత (ఎన్‌బీఎఫ్‌సీ)గా అవతరించడం అంబానీ లక్ష్యం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవలి వార్షిక నివేదికలో ఈ వివరాలను అందించారు. అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జెడ్‌ఎఫ్‌ఎస్) లిమిటెడ్ స్కిల్, డిజిటల్, రిటైల్ వ్యాపారాలు పరపతి పొందుతాయని తెలిపారు. రిలయన్స్ సాంకేతిక సామర్థ్యాలను కంపెనీ ఉపయోగించుకుంటుందని ఆయన వెల్లడిచారు. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటిటీ భారతీయ పౌరులకు ఆర్థిక సేవలను యాక్సెస్ చేయగలదని అంబానీ అభిప్రాయపడ్డారు. ఇది త్వరలో లిస్టు చేయబడుతుందని భావిస్తున్నారు. ఆగస్టు 28న జరిగే రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను చూడవచ్చు. రిలయన్స్‌లో జేఎఫ్‌ఎస్‌కు 6.1 శాతం వాటా ఉంది. జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి బ్లాక్‌రాక్‌తో భాగస్వామ్యాన్ని కంపెనీ గత నెలలో ప్రకటించింది.
బిలియన్ లావాదేవీల మార్కును దాటిన రిలయన్స్ రిటైల్
రిలయన్స్ రిటైల్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక బిలియన్ లావాదేవీల సంఖ్యను దాటింది. ఈ సమాచారం రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదికలో పేర్కొంది. రిలయన్స్ రిటైల్ డిజిటల్ వాణిజ్యం, కొత్త వాణిజ్య వ్యాపారాలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.60 లక్షల కోట్ల ఆదాయానికి 18 శాతం దోహదపడ్డాయి. సమీక్షలో ఉన్న కాలంలో కంపెనీ 3,300 కొత్త స్టోర్లను ప్రారంభించింది. ఇప్పుడు మొత్తం 18,040 దుకాణాలు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదిక ప్రకారం, “2022-23 ఆర్థిక సంవత్సరంలో, వ్యాపారం వార్షిక ప్రాతిపదికన 42 శాతం వృద్ధితో ఒక బిలియన్ లావాదేవీల సంఖ్యను దాటింది.
Jioకి $2.2 బిలియన్ల ఆర్థిక మద్దతు
మన దేశం అతిపెద్ద టెలికాం రిలయన్స్ జియో G5 సేవల కోసం ఫైనాన్సింగ్ పరికరాల కోసం స్వీడిష్ ఎగుమతి క్రెడిట్ ఏజెన్సీ నుంచి $2.2 బిలియన్ల ఆర్థిక సహాయాన్ని పొందింది. కంపెనీ తన 5G నెట్‌వర్క్‌ను విస్తరించడానికి స్వీడిష్ కంపెనీ ఎరిక్సన్, ఫిన్నిష్ కంపెనీ నోకియా నుంచి టెలికాం పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేసింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం