Green Logistics: ఇకపై ఇంటింటికీ ‘గ్రీన్ డెలివరీ’.. భారత్ మరో ముందడుగు
కాలుష్య రహిత రవాణా దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడిన రెండు సంస్థలు ప్రముఖ క్లీన్ మొబిలిటీ బ్రాండ్ మోంట్రా ఎలక్ట్రిక్ గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా, ఇకపై మీ ఇంటికి చేరే వస్తువులు, సరుకులు పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా వస్తాయి. సున్నా ఉద్గారాలతో కూడిన లాజిస్టిక్స్ వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి. రాబోయే కాలంలో డెలివరీ సేవలను మరింత పర్యావరణ హితంగా మార్చడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం.

సున్నా ఉద్గారాలు వెలువరించే, కర్బన రహిత మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించడం ద్వారా మొదటి మైలు, మధ్య మైలు, చివరి మైలు డెలివరీలలో స్వచ్ఛమైన రవాణా విధానాలు విస్తరిస్తాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా, మోంట్రా ఎలక్ట్రిక్ వచ్చే మూడు నెలల్లో 50 EVIATOR ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వాహనాలను (ఈ-ఎస్‌సీవీ) వినియోగంలోకి తెస్తుంది. దీనిపై ఇరు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.
మోంట్రా ఎలక్ట్రిక్ EVIATOR, ఈ విభాగంలోనే అత్యుత్తమ సామర్థ్యాలు కలిగి ఉంది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనంగా, టెలీమ్యాటిక్స్ సొల్యూషన్స్‌తో పని చేస్తుంది. ఎక్కువ లోడ్ మోయగల సామర్థ్యం, స్మార్ట్ టెక్ ఫీచర్లు, శక్తి ఆదా చేసే ప్రత్యేకత దీని సొంతం. భారత్‌లో కర్బన రహిత, సున్నా ఉద్గారాల లాజిస్టిక్స్ సాకారం చేయాలన్న గ్రీన్ డ్రైవ్ లక్ష్యానికి ఇది పూర్తిగా సరిపోతుంది. తొలి 50 వాహనాలను దశలవారీగా ప్రవేశపెడతారు. దీని ద్వారా గ్రీన్ డ్రైవ్ టెక్ ఆధారిత ఫ్లీట్ నిర్వహణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. ఇది రియల్-టైమ్ ట్రాకింగ్, స్మార్ట్ రూట్ ప్లానింగ్, ఏఐ-ఆధారిత పనితీరు విశ్లేషణలకు వీలు కల్పిస్తుంది.
“గ్రీన్ డ్రైవ్ మొబిలిటీతో చేతులు కలవడం చాలా సంతోషం. ఈ భాగస్వామ్యం భారత లాజిస్టిక్స్ వ్యవస్థలో స్వచ్ఛమైన రవాణా వాడకాన్ని వేగవంతం చేస్తుంది. EVIATOR అత్యాధునిక ఎలక్ట్రిక్ శక్తితో పని చేస్తుంది. ఆకట్టుకునే రేంజ్ అందిస్తుంది. వివిధ విభాగాల వ్యాప్తంగా ఆధునిక రవాణా అవసరాలకు పూర్తిగా సరిపోతుంది. కాలుష్య రహిత భవిష్యత్తు సాధించాలన్న మా ఉమ్మడి లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా గ్రీన్ డ్రైవ్‌తో కలిసి పని చేయడం సంతోషం” అని Mr. సజు నాయర్ తెలిపారు.
భారత్ పర్యావరణహిత మొబిలిటీకి మారుతున్న క్రమంలో, ఎప్పటికప్పుడు మారిపోయే వ్యాపార సంస్థల అవసరాలకు అనుగుణంగా అధునాతనమైన, పర్యావరణహితమైన, సమర్ధవంతమైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించడం ద్వారా కమర్షియల్ ఈవీ వ్యవస్థను పునర్నిర్వచించేందుకు మోంట్రా ఎలక్ట్రిక్, గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ భాగస్వామ్యం దోహదపడుతుంది. ఇది పరిశుభ్రమైన వాతావరణం, సమర్ధవంతమైన డెలివరీ సేవలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కల్పిస్తుంది.




