Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Tips: ముందు జాగ్రత్తతో ముప్పు నుంచి రక్షణ.. వర్షకాలంలో బైక్స్ విషయంలో ఈ టిప్స్ పాటించడం మస్ట్..!

ఇటీవల కాలంలో భారతదేశంలో బైక్ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంటికి తమ అవసరాలకు తీర్చుకునేందుకు బయటకు వెళ్లడానికి ఓ బైక్ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఏ వస్తువైన సరిగ్గా నిర్వహిస్తేనే అది కరెక్టుగా పని చేస్తుంది. ముఖ్యంగా బైక్స్ విషయంలో వర్షాకాల ముందుకు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో బైక్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఓ సారి చూద్దాం.

Monsoon Tips: ముందు జాగ్రత్తతో ముప్పు నుంచి రక్షణ.. వర్షకాలంలో బైక్స్ విషయంలో ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
Monsoon Riding
Follow us
Srinu

|

Updated on: Jun 08, 2025 | 7:28 PM

వర్షాకాలం ద్విచక్ర వాహనదారులకు కూడా వివిధ సవాళ్లను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వర్షంలో మోటార్ సైకిల్, స్కూటర్ రైడర్లకు రోడ్లు ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వర్షాకాలానికి ముందే మీ వాహన కండిషన్‌ను పర్‌ఫెక్ట్‌గా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మీ వాహనానికి సంబంధించిన భద్రతను నిర్ధారించడానికి, అలాగే దాని షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో బైక్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఓ సారి తెలుసుకుందాం.

బ్యాటరీ కనెక్టర్లు

వర్షాకాలంలో మీ బైక్ సజావుగా నడుస్తుందని నిర్ధారించుకోవడానికి బ్యాటరీ లైఫ్‌ను తనిఖీ చేసుకోవాలి. మీ బ్యాటరీ పాతదైతే మార్చుకోవడం ఉత్తమం. వర్షపు నీరు బ్యాటరీ కనెక్టర్లకు హాని కలిగించకుండా ఉండటానికి మీరు వాటిపై పెట్రోలియం జెల్లీని పూయడం మంచింది. వర్షాకాలంలో మీరు బైక్‌ను ఉపయోగించకపోతే బ్యాటరీని డిస్ కనెక్ట్ చేయడం ఉత్తమం.

చైన్

వర్షాకాలంలో లూబ్రికేషన్ అనేది ఒక సాధారణ సమస్య కావచ్చు, ఎందుకంటే ఇది కదిలే భాగాల మధ్య ఉండే గ్రీజు వర్షపు నీటి వల్ల ఉండదు. కాబట్టి బైక్ లేదా స్కూటర్లోని చైన్‌తో పాటు థొరెటల్ కేబుల్స్‌తో సహా ఇతర కీలక భాగాలను క్రమం తప్పకుండా లూబ్రికేట్ చేయడం మంచింది. ఒక వేళ మీరు చైన్ మార్చాల్సి వస్తే వాటర్ ప్రూఫ్ చైన్ మార్చడం మంచిది.

ఇవి కూడా చదవండి

టైరు

వర్షకాలంలో టైర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. గాలితో కరెక్ట్‌గా ఉండే టైర్ తడితో పాటు జారే ఉపరితలాల పై సరైన పట్టును అందిస్తుంది. అదే సమయంలో మీ టైర్ లైఫ్2ను తనిఖీ చేయండి. ట్రెడ్ లోతు 70 శాతం కంటే తక్కువగా ఉంటే దానిని భర్తీ చేయడం మంచింది. 

బ్రేక్లు, లైట్లు

మీ బైక్‌లోని ఎలక్ట్రికల్స్ వస్తువులు సరిగ్గా పని చేస్తున్నాయో? లేదో? నిర్ణయించుకోవాలి. వైరింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించారు. లూజ్ ఎండ్స్ లేకుండా ఉండడంతో పాటు ఇండికేటర్లు పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడం మంచింది. హెర్ల్యాంప్, టెయిల్ లైట్ కూడా పని చేసేలా చూసుకోవాలి. వర్షాకాలంలో చెడు వైరింగ్ కారణంగా విఫలమయ్యే ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తనిఖీ చేయండి. వదులుగా ఉండే వైరింగ్ ఉండే కనెక్టర్లు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. 

రైడింగ్ గేర్

వర్షాకాలంలో ముఖ్యంగా మీరు గతుకుల రోడ్లల్లో ప్రయాణించాల్సి రావచ్చు. కాబట్టి మీ బైక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజూ కాకపోయినా క్రమం తప్పకుండా ప్రెషర్ వాష్ చేయడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది. అదే సమయంలో మీ రైడింగ్ గేరు కూడా తనిఖీ చేయడం ముఖ్యం. తడిగా ఉన్న హెల్మెట్లు, జాకెట్లు, ప్యాంటు, గ్లోవ్స్, బూట్లు వంటి తడి రైడింగ్ గేర్లు తడిగా ఉండడం వల్ల బూజు, ఫంగస్‌కు కారణమవుతాయి. కాబట్టి వాటిని ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?