MG cyberster: అదిరే లుక్‌తో ఎంజీ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఏంటంటే?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఈ విభాగంలో అనేక మోడళ్ల బైక్ లు, కార్లు విడుదలవుతున్నాయి. పెరుగుతున్న పెట్రోలు ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు ఇవి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊపందుకుంది. వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్ లోకి స్పోర్ట్స్ కారు రాబోతోంది.

MG cyberster: అదిరే లుక్‌తో ఎంజీ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఏంటంటే?
Mg Cyberster
Follow us
Srinu

|

Updated on: Dec 06, 2024 | 4:45 PM

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటారు కంపెనీ నుంచి ఎంజీ సైబర్ స్టర్ పేరుతో విడుదల అవుతున్న ఈ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఎంజీ సైబర్ స్టర్ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది మార్చిలో మన దేశంలో ప్రదర్శించారు. ఆ కంపెనీ నుంచి విడుదల కానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జేఎస్ డబ్ల్యూ, ఎంజీ కంపెనీలు కలిసి దీన్ని రూపొందించాయి. ఈ కారును 2025 జనవరిలో మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఎంపీ సెలెక్ట్ అనే రిటైల్ చానల్ ద్వారా విక్రయాలు జరుగుతాయి. జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా తన ప్రీమియం ప్రాడెక్టుల విక్రయాల కోసం ఎంపీ సెలెక్ట్ అనే రిటైల్ చానల్ ను ప్రకటించింది. దానిలో విక్రయించనున్న మొదటి కారు కూడా సైబర్ స్టర్ కావడం విశేషం. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 12 సెలెక్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. వాటిని సంఖ్యను క్రమంగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేకమైన డిజైన్ తో కొత్త కారు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. బటర్ ఫ్లై డోర్స్, డ్యూయల్ టోన్ 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, సొగసైన టెయిల్ ల్యాంపులు, స్ప్లిట్ ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. ఈ కారు పొడవు 4,533 ఎంఎం పొడవు, 1,912 ఎంఎం వెడల్పు, 1,328 ఎంఎం ఎత్తు, 2,689 ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంది. కేవలం 3.2 సెకన్ల నుంచి వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. బ్యాటరీ ప్యాక్, మోటారు అనే రెండు ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఎంట్రీ లెవెల్ మోడల్ లో సింగిల్ రియర్ యాక్సిల్ మౌంటెడ్ 308 హెచ్ పీ మోటారు అమర్చారు. అలాగే 64 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో గరిష్టంగా 520 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అలాగే టాపింగ్ మోడల్ 77 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో 580 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ కారు ధర రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

దేశంలో లగ్జరీ కార్ల విభాగం నాలుగేళ్లుగా ఊపందుకుంది. సాధారణ సెగ్మెంట్ కార్ల కంటే వీటి అమ్మకాలు పెరిగాయి. ఇలాంటి సమయంలో విడుదల అవుతున్న సైబర్ స్టర్ కు మంచి ఆదరణ లభిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి