MG Cloud EV: ఎంజీ నుంచి వరుసగా మూడో ఎలక్ట్రిక్ కార్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. పూర్తి వివరాలు ఇవి..
ముఖ్యంగా ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాలను పెద్ద ఎత్తున లాంచ్ చేస్తోంది. కనీసం మూడు నుంచి ఆరు నెలల మధ్య ఓ కొత్త ఈవీని మార్కెట్లోకి విడుదల చేస్తోంది. గతేడాది ఎంజీ కామెట్ ఈవీని లాంచ్ చేసిన తర్వాత జెడ్‌ఎస్ ఈవీని వరుసగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మరో కారును ఆవిష్కరించేందుకు ముహూర్తం సెట్ చేసింది. 2024 సెప్టెంబర్లో ఈ కొత్త ఈవీని పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంజీ క్లౌడ్ ఈవీ పేరుతో దీనిని తీసుకొస్తోంది.
ఎంజీ బ్రాండ్ కార్లకు మన దేశంలో మంచి క్రేజ్ ఉంది. దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీ కొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాలను పెద్ద ఎత్తున లాంచ్ చేస్తోంది. కనీసం మూడు నుంచి ఆరు నెలల మధ్య ఓ కొత్త ఈవీని మార్కెట్లోకి విడుదల చేస్తోంది. గతేడాది ఎంజీ కామెట్ ఈవీని లాంచ్ చేసిన తర్వాత జెడ్‌ఎస్ ఈవీని వరుసగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మరో కారును ఆవిష్కరించేందుకు ముహూర్తం సెట్ చేసింది. 2024 సెప్టెంబర్లో ఈ కొత్త ఈవీని పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంజీ క్లౌడ్ ఈవీ పేరుతో దీనిని తీసుకొస్తోంది. ఇది రూ. 20లక్షలలోపు ధరలోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, బీవైడీ ఈ6, మహీంద్రా ఎక్స్‌యూవీ400తో పాటు త్వరలో లాంచ్ కానున్న మారుతి సుజుకీ ఈవీఎక్స్ వంటి వాటికి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎంజీ క్లౌడ్ ఈవీ డిజైన్..
ఎంజీ క్లౌడ్ ఈవీ అనేది ఎస్‌ఏఐసీ ద్వారా ఎంజీ బ్రాండ్ నేమ్‌తో అందుబాటులో ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ కాంపాక్ట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. దీని పొడవు సుమారుగా 4,300 మి.మీ. ఉంటుంది. ఇది కియా కారెన్స్, మారుతి సుజుకి ఎర్టిగా కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది. వీలే బేస్ 2,700 మి.మీ. వరకు విస్తరించి ఉంటుంది. దీని లుక్ చాలా కొత్తగా ఉంది. ఫ్రంట్ ఫాసియా పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తుంది.ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, విస్తృత ఎయిర్ డ్యామ్ సంభావ్య ఏరోడైనమిక్ ప్రయోజనాలను అందిస్తాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి.
ఎంజీ క్లౌడ్ ఈవీ ఇంటీరియర్..
ఈ కారు ఇంటీరియర్ మినిమలిస్ట్ డిజైన్ విధానాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. క్లీన్, హారిజోంటల్ లైన్స్ డాష్ బోర్డ్, డోర్ ట్రిమ్లను డామినేట్ చేసే అవకాశం ఉంది. ఇది విశాలమైన భావాన్ని సృష్టిస్తుంది. ఫీచర్ల పరంగా, క్లౌడ్ ఈవీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను అందించవచ్చు. సమాంతరంగా ఉంచబడిన ఏసీ వెంట్లు, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, పనోరమిక్ సన్ రూఫ్, క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, అఆస్ సూట్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఎంజీ క్లౌడ్ ఈవీ పవర్ ట్రెయిన్..
భారతదేశం వెలుపల ఉన్న మార్కెట్లలో ఎంజీ క్లౌడ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది: 37.9కేడబ్ల్యూహెచ్, 50.6కేడబ్ల్యూ బ్యాటరీ. ఇవి వరుసగా 360 కి.మీ, 460 కి.మీల రేంజ్‌లను అందిస్తాయి. రెండు వేరియంట్లు 132 బీహెచ్‌పీ ఉత్పత్తి చేసే ఫ్రంట్-మౌంటెడ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను కలిగి ఉంటాయి. అయితే మన దేశంలో ఈ రెండు బ్యాటరీల్లో ఏది అందుబాటులో ఉంటుందోచూడాలి. ఈ నిర్ణయం మార్కెట్ డిమాండ్, ప్రభుత్వ నిబంధనలు, వాహన ధరలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..