AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mark Zuckerburg: జుకర్‌బర్గ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే మైండ్‌ బ్లాంకే..!

Mark Zuckerburg Luxury Watch: జుకర్‌బర్గ్ కొత్త లగ్జరీ వాచ్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. మార్క్ ఈ గడియారాన్ని తన మణికట్టుపై ధరించాడు. దాని తర్వాత ఇది ప్రజల దృష్టిని ఆకర్షించింది. బ్రాండ్ ఈ వాచ్ ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా SOSC. ఇది ఇటాలియన్ లగ్జరీ ఉత్పత్తుల తయారీదారు సంస్థ బల్గారిచే తయారు చేసింది..

Mark Zuckerburg: జుకర్‌బర్గ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే మైండ్‌ బ్లాంకే..!
Subhash Goud
|

Updated on: Dec 16, 2024 | 7:49 PM

Share

మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మరోసారి ముఖ్యాంశాలలో నిలిచారు. ఈసారి చర్చకు కారణం అతని లగ్జరీ వాచ్. ఇటీవల మార్క్ జుకర్‌బర్గ్ మెటాలో AI అప్‌డేట్‌లను చర్చించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సమయంలో అతని మణికట్టు మీద కనిపించిన వాచ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వాచ్ చర్చనీయాంశంగా మారింది.

ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటి?

  • ఆక్టో ఫినిస్సిమో అల్ట్రా SOSC అనేది ప్రపంచంలోనే అత్యంత సన్నని మెకానికల్ వాచ్. ఇది కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది. ఇది రెండు క్రెడిట్ కార్డ్‌ల పరిమాణం.
  • ఇది పరిమిత ఎడిషన్ వాచ్. ఇందులో 20 యూనిట్లు మాత్రమే తయారు చేస్తారు.
  • ఈ గడియారాన్ని స్టోర్‌ చేయడానికి స్పెషల్‌గా తయారు చేసిన కేస్‌తో వస్తుంది. స్వయంచాలకంగా సెట్ చేస్తుంది. ఈ వాచ్‌లో కేసులో పెట్టేందుకు వాచ్‌ విండో దానికదే ఓపెన్‌ అవుతుంది.
  • ఇందులో 170 విభిన్న భాగాలు చేర్చి తయారు చేసింది కంపెనీ.
  • వాచ్ ప్రధాన ప్లేట్ టంగ్‌స్టన్‌ కార్బైడ్‌తో తయారు చేశారు. బ్రాస్లెట్, లగ్స్, టైటానియంతో తయారు చేశారు.
  • ఈ గడియారం స్విస్ అధికారిక క్రోనోమీటర్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ (COSC) నుండి సర్టిఫికేట్ పొందింది.
  • ఈ లగ్జరీ వాచ్ ధర సుమారు అక్షరాల రూ. 5 కోట్లు.

జుకర్‌బర్గ్‌కు అత్యాధునిక గడియారాల పట్ల మక్కువ:

మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను ఇష్టపడతారు. గత నెలలో అతను మరో లగ్జరీ వాచ్ De Bethune DB25 స్టార్రి వేరియస్ ఏరోలైట్ ధరించి కనిపించాడు. ఈ వాచ్ పరిమిత ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం 5 యూనిట్లు మాత్రమే తయారు చేస్తారు. దీని ధర సుమారు రూ. 2.20 కోట్లు. జుకర్‌బర్గ్ ఈ గడియారాలు అతని అత్యాధునిక, ప్రత్యేకమైన అభిరుచులను చూపుతాయి. ఈ వాచ్‌ కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంది.

ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు, వివాహానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యేందుకు మార్క్ జుకర్‌బర్గ్ కూడా తన భార్యతో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. ఇంతలో అనంత్ అంబానీ ధరించిన వాచ్‌పై వారు ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఇందులో అతను AI గురించి మాట్లాడటం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మణికట్టుకు పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ఖరీదు కోట్ల రూపాయలు, అలాగే ప్రపంచంలోనే అత్యంత పలుచని గడియారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి