AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki XL7 SUV: ఇన్నోవాకు పోటీగా మారుతీ సుజుకీ నయా ఎస్‌యూవీ.. ఫీచర్లు చూస్తే మతిపోతుందంతే..!

మారుతీ సుజుకీ కంపెనీ తాజాగా కార్‌ను మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌ వెర్షన్లల్లో వచ్చే ఎస్‌యూవీలకు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. విశాలవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం కస్టమర్లు ఈ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా ఎక్స్‌ఎల్‌ వెర్షన్లకు కొనసాగింపుగా ఎక్స్‌ఎల్‌ 7 పేరుతో కొత్త ఎస్‌యూవీని మారుతీ సుజుకీ భారతదేశంలో విడుదల చేయబోతుంది.

Maruti Suzuki XL7 SUV: ఇన్నోవాకు పోటీగా మారుతీ సుజుకీ నయా ఎస్‌యూవీ.. ఫీచర్లు చూస్తే మతిపోతుందంతే..!
Maruthi Suziki Xl7
Nikhil
|

Updated on: May 15, 2023 | 5:30 PM

Share

కారు కొనుగోలుదారులు కారు కొనే సమయంలో ముందుగా చూసేది కంఫర్ట్‌. ఇంట్లోని వారంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం ఆశ్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. కంపెనీలు కూడా వీరి ఆలోచనలకు తగినట్లుగానే ఎప్పటికప్పుడు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో ముందువరుసలో ఉన్న మారుతీ సుజుకీ కంపెనీ తాజాగా కార్‌ను మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌ వెర్షన్లల్లో వచ్చే ఎస్‌యూవీలకు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. విశాలవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం కస్టమర్లు ఈ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా ఎక్స్‌ఎల్‌ వెర్షన్లకు కొనసాగింపుగా ఎక్స్‌ఎల్‌ 7 పేరుతో కొత్త ఎస్‌యూవీని మారుతీ సుజుకీ భారతదేశంలో విడుదల చేయబోతుంది. ముఖ్యంగా ఇన్నోవాకు పోటీగా ఈ కార్‌ను సుజుకీ కంపెనీ రిలిజ్‌ చేస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌ 7 ఫీచర్లు ఏంటో ఓ సారి లుక్కేద్దాం.

మారుతీ సుజుకీ ఇప్పటికే ఇండోనేషియాలో ఎక్స్‌ఎల్‌ 7కు సంబంధించిన లేటెస్ట్‌ వేరియంట్‌ ఆల్ఫా ఎఫ్‌ఎఫ్‌ను పరిచయం చేసింది. ఎఫ్‌ఎఫ్‌ అంటే ఉత్తమ రూపం అని అర్థం. ప్రస్తుతం జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించారు. 2021లో జీఐఏస్‌లో ప్రారంభమైన సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్‌ఎఫ్‌, ఎక్స్‌ఎల్‌ 7 ఆల్ఫా ఎఫ్‌ఎఫ్‌లా అదే మెరుగుదలను పొందింది. ఈ కార్‌ 1.5-లీటర్ కే 15 బీ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా వాహనానికి శక్తినిస్తుంది. ఇది 4,400 ఆర్‌పీఎం వద్ద 138 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను 6000 ఆర్‌పీఎం వద్ద 104 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదనంగా కొత్త ఎక్స్‌ఎల్‌ 7 5-స్పీడ్ మాన్యువల్తో 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. ఈ కారు చాలా అత్యాధునిక ఫీచర్లతో రానుంది. ఇది ఈ కారు లగ్జరీని మరింత పెంచుతుంది. అలాగే ఈ కార్‌లో ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కార్బన్ ఫైబర్ డ్యాష్‌బోర్డ్ డెకర్, ముందు, రెండవ వరుసలకు ఛార్జింగ్, స్టాండర్డ్ మిడిల్ ఆర్మ్‌రెస్ట్‌లు, లెదర్‌తో వచ్చే స్టీరింగ్ వీల్స్, పుష్-బటన్/స్టాప్ కీలెస్ ఎంట్రీ వంటి సౌకర్యాలతో వస్తుంది. కండిషనింగ్, వెంటెడ్ కప్ హోల్డర్‌లు, రియర్‌వ్యూ కెమెరా, ఐఎస్‌ఓ ఫిక్స్‌ చైల్డ్ సీట్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటివి కచ్చితం వినియోగదారులను ఆకట్టుకుంటాయి.