Maruti Suzuki Offers: ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన మారుతి సుజుకి

వచ్చే ఏడాది కార్లు కొనుగోలు చేసేవారికి షాకిచ్చేందుకు మారుతి సుజుకీ సంస్థ సిద్ధమవుతోంది. పలు మోడళ్ల కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది..

Maruti Suzuki Offers: ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన మారుతి సుజుకి
Maruti Suzuki
Follow us
Subhash Goud

|

Updated on: Dec 03, 2022 | 4:26 PM

వచ్చే ఏడాది కార్లు కొనుగోలు చేసేవారికి షాకిచ్చేందుకు మారుతి సుజుకీ సంస్థ సిద్ధమవుతోంది. పలు మోడళ్ల కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ ధరలు పెంపునకు ముందు ఈ నెలలో కొన్ని మోడళ్ల కార్లపై ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఎంపిక చేసిన పలు మోడళ్లపై రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌లో ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, క్యాష్ డిస్కౌంట్లు, యాక్సెసరీస్ లేదా కాంప్లిమెంటరీ సర్వీస్‌లతో పాటు కార్పొరేట్ ఆఫర్‌లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు విషయం ఏంటంటే ఎర్టిగా, బ్రెజ్జా, XL6, గ్రాండ్ విటారా తాజా మోడల్‌లు ఈ జాబితాలో చేర్చలేదు.

ఆటోమేకర్ చిన్న కార్లపై కొన్ని అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త తరం ఆల్టో K10 నవంబర్‌లో రూ. 52,000 వరకు ప్రయోజనాలతో అందిస్తోంది. ఇందులో రూ. 30,000 వరకు విలువైన నగదు తగ్గింపులు, రూ.15,000 వరకు విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.5,000 వరకు విలువైన కార్పొరేట్ డిస్కౌంట్‌లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదనంగా ఆటోమేటిక్ వేరియంట్‌లు రూ. 22,000 వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. అలాగే సీఎన్‌జీ వేరియంట్‌లు రూ.45,100 తగ్గింపుతో వస్తాయి.

ఈ నెలలో మారుతీ కార్లలో ప్రసిద్ధి చెందిన కార్లలో సెలెరియో. ఈ కారు విలువలో రూ.46,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ కారు సీఎన్‌జీ వెర్షన్ ఆల్టో K10 CNG మాదిరిగానే తగ్గింపును పొందువచ్చు. అయితే ఆటోమేటిక్ వేరియంట్‌లు రూ. 21,000 విలువైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మారుతి సెలెరియో కూడా డిసెంబర్‌లో పెద్ద తగ్గింపులతో అందించబడుతుంది. సీఎన్‌జీ వేరియంట్‌ని ఎంచుకుంటే ఈ హ్యాచ్‌బ్యాక్‌పై గరిష్ట తగ్గింపు రూ.45,100. మాన్యువల్ వేరియంట్‌లు రూ.36,000 వరకు తగ్గింపును పొందవచ్చు. సెలెరియోలో ఆటోమేటిక్ వేరియంట్‌లను రూ.21,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

మారుతీ వ్యాగన్ఆర్, ఆల్టో 800 కూడా రూ.42,000 వరకు తగ్గింపుతో అందించబడతాయి. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, డిజైర్ సబ్-కాంపాక్ట్ సెడాన్‌లు ఈ నెలలో రూ.32,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు.

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి జనవరి 2023 నుండి మోడళ్లలో ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మొత్తం ద్రవ్యోల్బణం, ఇటీవలి నియంత్రణ అవసరాల కారణంగా నిరంతర వ్యయ ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే