AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రేలియాలో లాంచ్‌ అయిన మేడ్‌ ఇన్‌ ఇండియా కారు.. ఐదు డోర్లు.. వావ్‌ అనే ఫీచర్లు..

Maruti Suzuki Jimny: మారుతి సుజుకీ నుంచి మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తి అయిన ఐదు డోర్ల జిమ్నీ ఎస్‌యూవీ కారు విదేశాలలో సత్తా చాటుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాలో ఈకారును ఆవిష్కరించిన కంపెనీ ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో దీనికి జిమ్నీ ఎక్స్‌ఎల్‌ అని పేరు పెట్టింది. బేసిక్‌ వెర్షన్‌కు కొన్ని స్పెసిఫికేషన్లలో మార్పులు చేసి అక్కడ లాంచ్‌ చేసింది.

ఆస్ట్రేలియాలో లాంచ్‌ అయిన మేడ్‌ ఇన్‌ ఇండియా కారు.. ఐదు డోర్లు.. వావ్‌ అనే ఫీచర్లు..
Maruti Suzuki Jimny
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Dec 15, 2023 | 7:40 PM

సాధారణంగా కార్ల బ్రాండ్లు ఎక్కువ విదేశీ కంపెనీలవే అధికంగా ఉన్నాయి. అక్కడెక్కడో తయారైన మోడళ్లకు కొన్ని మార్పులు చేర్పులు చేసి మన దేశంలో ఆవిష్కరించడం ఎక్కువగా మనం చూశాం. అయితే ఇటీవల మేడిన్‌ ఇండియా ఉత్పత్తులు కూడా దేశ విదేశాల్లో ఆవిష్కృతమవుతున్నాయి. మన దేశంలో విజయవంతమైన బ్రాండ్లు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ఇదే క్రమంలో మారుతి సుజుకీ నుంచి మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తి అయిన ఐదు డోర్ల జిమ్నీ ఎస్‌యూవీ కారు విదేశాలలో సత్తా చాటుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాలో ఈకారును ఆవిష్కరించిన కంపెనీ ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో దీనికి జిమ్నీ ఎక్స్‌ఎల్‌ అని పేరు పెట్టింది. బేసిక్‌ వెర్షన్‌కు కొన్ని స్పెసిఫికేషన్లలో మార్పులు చేసి అక్కడ లాంచ్‌ చేసింది. ఈ ఐదు డోర్ల జిమ్నీని ఏడాదిలో జూన్‌లో మన దేశంలో తొలిసారి లాంచ్‌ చేశారు. రూ. 12.74కోట్ల ఎక్స్‌షోరూం ధరతో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వెర్షన్‌కి, మన దేశంలోని మోడల్‌ కి మధ్య తేడా ఎంటి? ఏమేమి మార్పులు చేశారు. తెలుసుకుందాం..

ప్రధాన తేడా ఫీచర్స్‌..

ఆస్ట్రేలియాలోని లాంచ్‌ చేసిన మోడల్ అడాస్‌ (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్స్‌)తో సహా కొన్ని అదనపు ఫీచర్లతో వస్తుంది. అడాస్‌ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై-బీమ్ అసిస్ట్, వీవింగ్ అలర్ట్, యాంటీ కొలిషన్ వార్నింగ్, డ్యూయల్ కెమెరా బ్రేక్ సపోర్ట్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంది.

పవర్ ట్రెయిన్‌..

మారుతి సుజుకీ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీనిలో 1.5-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 100 బీహెచ్‌పీ శక్తిని, 130ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మంచి పనితీరుని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు ఇవి..

జిమ్నీ ఎక్స్‌ఎల్‌ క్యాబిన్ లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ట్విన్-డయల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 3-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ధర ఎంతంటే..

ఆస్ట్రేలియాలో ఇప్పటికే మూడు డోర్‌ కలిగిన జిమ్నీ లైట్‌, జిమ్నీ వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త వెర్షన్‌ ఐదు డోర్ల జిమ్నీ ఎక్స్‌ఎల్‌ ధర AUD 34,990 (సుమారు రూ. 18.60 లక్షలు)గా ఉంది. ఈ కారు మన దేశంతో పాటు దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా విక్రయాలకు అందుబాటులో ఉంది. వాస్తవానికి మహీంద్రా థార్‌ 4*4 కారుకు పోటీగా మన దేశంలో దీనిని మారుతీ సుజుకీ లాంచ్‌ చేసింది. రెండూ ఇంచుమించు ఒకటే లుక్లో ఉంటాయి. అయితే థార్ మూడు డోర్లు మాత్రమే ఉంటాయి. అయితే జిమ్నీకి మాత్రం ఐదు డోర్లు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఐపీఎల్ కంటెంట్ పై బీసీసీఐ ఉక్కుపాదం: యూట్యూబ్ షాక్!
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
ఏపీలో సమంతకు గుడి ఉందని తెల్సా.. ఈసారి మరో విగ్రహం..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
కుండలో నీళ్లు వేగంగా కూలైపోతాయి.. ఈ ఒక్క సింపుల్ టిప్‌తో..
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
అక్షయతృతీయన లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించేందుకు ఒక్కపని చేయండి
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేః ఫరూక్ అబ్దుల్లా
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి.. ట్రోఫీ లేకున్నా RCB తోపే
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
టీ బ్రేక్‌లో టేస్టీ వడలు.. ఎవ్వరైనా చేసేయొచ్చిలా...
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా
పబ్లిక్ మీటింగ్‌లో ASPపై చేయెత్తిన CM సిద్ధరామయ్య.. వీడియో చూశారా
తాలిబాన్లతో భారత అధికారుల భేటీ! పాక్‌కు దబిడి దిబిడే..!
తాలిబాన్లతో భారత అధికారుల భేటీ! పాక్‌కు దబిడి దిబిడే..!