Maruti Suzuki Celerio: మారుతి సుజుకి నుంచి సెలెరియా సీఎన్‌జీ కారు విడుదల.. అదిరిపోయే ఫీచర్స్..!
Maruti Suzuki Celerio: మారుతీ సుజుకి కొత్త కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆల్-న్యూ సెలెరియో ( Celerio) సీఎన్‌జీ (CNG)..
Maruti Suzuki Celerio: మారుతీ సుజుకి కొత్త కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆల్-న్యూ సెలెరియో ( Celerio) సీఎన్‌జీ (CNG) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.6.58 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది కంపెనీ. కె-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్‌తో రూపొందిన ఈ సరికొత్త సెలెరియోను ఎస్-సీఎన్‌జీ టెక్నాలజీతో రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. కిలో సీఎన్‌జీతో 35.60 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని, సీఎన్‌జీ ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు ఉంటుందని తెలిపింది. కొత్త మారుతి సెలెరియో యొక్క CNG వెర్షన్ పెట్రోల్-బేస్డ్ కారు నుండి అదే 1.0-లీటర్ K10C డ్యూయల్‌జెట్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 57 బిహెచ్‌పి పవర్, 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే స్టాండర్డ్ కంటే కూడా 10 బిహెచ్‌పి పవర్, 6.9 ఎన్ఎమ్ టార్క్ తగ్గుతుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
మారుతి సుజుకి తన మొదటి తరం హ్యాచ్‌బ్యాక్‌ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 6 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ యొక్క అమ్మకాలు విపరీతంగా పెరగడానికి సెలెరియో చాలా సహకరించిందని కంపెనీ తెలిపింది. కొత్త సెలెరియో CNG మోడల్ దాని మునుపటి మోడల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌తో రూపొందింది. మారుతి సుజుకి సెలెరియో పొడవు 3,695 మిమీ, వెడల్పు 1,655 మిమీ, ఎత్తు 1,555 మిమీ వరకు ఉంటుంది. ఇది 2,435 మిమీ వీల్‌బేస్ కూడా కలిగి ఉంటుంది. అందుకే వాహనాదారులకు అనుకూలంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: