Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనుగోలుదారులకు షాకింగ్‌.. లబోదిబోమంటున్న కస్టమర్లు

Ola Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఎంతగానో మేలు చేస్తున్నాయి. ఇక కొన్ని..

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనుగోలుదారులకు షాకింగ్‌.. లబోదిబోమంటున్న కస్టమర్లు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 18, 2022 | 11:46 AM

Ola Electric Scooter: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఎంతగానో మేలు చేస్తున్నాయి. ఇక కొన్ని రోజుల నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పోటా పోటీలు పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్లను డిసెంబర్‌ నెలలో డెలివరీలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత స్కూటర్లను అందుకున్న కొనుగోలుదారులు షాక్‌ తగిలింది. ఓలా ఎస్‌1 స్కూటర్ ఫీచర్లలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా రూ.499తో బుక్‌ చేసుకున్న వారికి స్కూటర్లను అందించింది కంపెనీ. అయితే ఓలా స్కూటర్ కోసం బుకింగ్స్‌ కూడా భారీగా ఉండటంతో కొన్ని రోజులు నిలిపివేసి తర్వాత ప్రారంభించింది కంపెనీ. ఇప్పటికే కొందరు బుకింగ్‌ చేసుకున్న రెండు నెలలు అవుతున్నా.. ఇంకా వారికి డెలివరీ కాలేదు. ఓలా స్కూటర్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు కొందరు కొనుగోలుదారులు గుర్తించి ఓలాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వరుణ్‌ దూబే స్పందించారు.

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లలో సాఫ్ట్‌వేర్‌లను మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్య కాలంలో అప్‌డేట్‌ చేస్తామని పేర్కొన్నారు. ఈ స్కూటర్‌లో క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, నావిగేషన్ వంటి ఫీచర్లు జూన్‌ నాటికి అందుబాటులోకి రానున్నట్లు, తలెత్తిన లోపాలను సరి చేస్తామని చెప్పుకొచ్చారు. సాంకేతిక లోపం తలెత్తిన ఫీచర్ల సాఫ్ట్ వేర్‌లను అప్‌డేట్‌ చేసి మరికొన్ని ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. స్కూటర్‌ అందుకున్న కొందరు నిరాశ చెందారు. డెలివరీ పొందిన వారం తర్వాత స్టీరింగ్‌ లాకింగ్‌లో సమస్య, సెన్సార్‌లో సమస్య, ఇంకా సంకేతిక లోపాలు ఉన్నట్లు ఓ వాహనదారుడు ట్వీట్‌ చేశాడు.