Maruti Suzuki: మారుతి సుజుకికి భారీగా తగ్గిన లాభాలు.. దెబ్బతీసిన సెమీ కండక్టర్ల కొరత..!

Maruti Suzuki:దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి లాభాలు తగ్గాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో..

Maruti Suzuki: మారుతి సుజుకికి భారీగా తగ్గిన లాభాలు.. దెబ్బతీసిన సెమీ కండక్టర్ల కొరత..!
Follow us

|

Updated on: Jan 26, 2022 | 7:34 AM

Maruti Suzuki:దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి లాభాలు తగ్గాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 47.82 శాతం క్షీణించి రూ.1,041.8 కోట్ల కు పడిపోయినట్లు నివేదికలు తెలిపాయి. ఇక రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికరలాభం రూ.1,996.7 కోట్లుంది. మరో వైపు అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత కారణంగా క్యు3లో 90 వేల కార్లు ఉత్పత్తి చేయలేకపోయామని మారుతి సుజుకి వెల్లడించింది. అమ్మకాలు పడిపోవడంతో పాటు కమోడిటీ ధరల పెరుగుదల లాభాలు తగ్గిపోయాయని తెలిపింది.

అలాగే త్రైమాసికంలో ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.23,253.3 కోట్లుంది. మొత్తం వాహనాల విక్రయాలు 13.1 శాతం పడిపోయి 4,30,668 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఇలా సెమికండక్టర్‌ కొరత కారణంగా మారుతి సుజుకికి లాభాలు తగ్గుముఖం పట్టాయి. మరో వైపు పండగ సీజన్‌లో డిమాండ్‌ అధికంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్లాంట్లలో ఉత్పత్తి చేయలేదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 2.40 లక్షల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Hyderabad: టెక్నాలజీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. చిప్‌ల తయారీ దిశగా సెరిమోర్ఫిక్‌ కంపెనీ

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే