Electric Vehicles: ఎలక్ట్రిక్ కార్లా.. మాకొద్దు బాబోయ్ అంటున్న వినియోగదారులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఇటీవల ఊపందుకుంది. చార్జింగ్ చేసుకునే సౌలభ్యం, ప్రభుత్వం రాయితీలు, పర్యావరణ పరిరక్షణ కోసం వీటిని కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దానికి అనుగుణంగానే డిమాండ్ కూడా పెరిగింది. అయితే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ను షాక్ కు గురిచేసే విషయం ఒక బయటకు వచ్చింది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలోని దాదాపు 51 శాతం ఎలక్ట్రిక్ కార్ల యజమానులు తమ వాహనాలను మార్చాలను ఆలోచిస్తున్నారని తెలిసింది.

దేశంలో కార్ల వినియోగంగా విపరీతంగా పెరిగింది. సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరలలో వివిధ కంపెనీల కార్లు లభిస్తున్నాయి. పెరిగిన రవాణా చార్జీలు కూడా వీటి వినియోగం పెరగడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఇటీవల ఊపందుకుంది. చార్జింగ్ చేసుకునే సౌలభ్యం, ప్రభుత్వం రాయితీలు, పర్యావరణ పరిరక్షణ కోసం వీటిని కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దానికి అనుగుణంగానే డిమాండ్ కూడా పెరిగింది. అయితే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ను షాక్ కు గురిచేసే విషయం ఒక బయటకు వచ్చింది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలోని దాదాపు 51 శాతం ఎలక్ట్రిక్ కార్ల యజమానులు తమ వాహనాలను మార్చాలను ఆలోచిస్తున్నారని తెలిసింది. దీనికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
సర్వేలో వెల్లడైన అంశాలు..
ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లోని దాదాపు 500 ఈవీ కార్ల యజమానులను సర్వే చేశారు. ఈవీ కార్ల పనితీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సురక్షిత, పనిచేసే చార్జింగ్ స్టేషన్లను కనుగొనడంలో ఇబ్బంది పడుతున్నామని దాదాపు 88 శాతం మంది తెలిపారు. మన దేశంలో దాదాపు 20 వేలకు పైగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయినప్పటికీ పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. అలాగే 51 శాతం మంది పలు ఇబ్బందులు కారణంగా తమ ఈవీ కార్లను వదిలేసి, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాలకు తిరిగి మారడానికి ఆలోచిస్తున్నట్టు తెలిపారు.
ఖర్చుల విషయంలో ఇబ్బంది..
ఎలక్ట్రిక్ కార్ల యజమానులలో దాదాపు 73 శాతం మంది నిర్వహణ ఖర్చుల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అవి చాలా అస్పష్టంగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. స్థానిక మెకానిక్‌లు చిన్నపాటి సమస్యలపై కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాగే మరమ్మతులకు అయ్యే ఖర్చుల విషయంలోనూ వారికి అవగాహన ఉండడం లేదన్నారు.
రీసేల్ లేకపోవడం..
ఈవీ కార్ల విషయంలో యాజమానులు ఎదుర్కొనే మరో ముఖ్యమైన సమస్య రీసేల్. ఏవైనా కారణాలతో కారను రీసేల్ (పునఃవిక్రయం) చేయాలంటే ధర గణనీయంగా తగ్గిపోతుందని 33 శాతం మంది చెప్పారు. ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాహనం విలువలో దాదాపు 30 శాతం ఉంటున్న ఈవీ బ్యాటరీ నాణ్యతను గుర్తించడానికి విస్తృత పరీక్ష లేదని తెలిపారు. పైన తెలిపిన ఇబ్బందుల కారణంగా 51 శాతం ఈవీ యజమానులు ఐసీఈ వాహనాలకు తిరిగి మారడానికి ప్రయత్నిస్తున్నారు.
వీటికే డిమాండ్ ఎక్కువ..
ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో టాటా నెక్సాన్ ముందు వరుసలో ఉంది. దాదాపు 61 శాతం మంది ఈ విషయం తెలిపారు. తర్వాత స్థానంలో టాటా పంచ్ (19 శాతం) నిలిచింది. కాగా.. దేశంలో ఎలక్ట్రిక్ కార్లను ఆదరణ పెరుగుతున్నప్పటికీ వాహనాల యజమానులను చార్జింగ్ సమస్య వేధిస్తోంది. ఆ సవాల్ ను కార్ల కంపెనీలు సమర్థంగా అధిగమిస్తే మరింత అమ్మకాలు పెరుగుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..