PPF Account online: పీపీఎఫ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. ఆన్‌లైన్‌లోనే అప్లయ్ చేయండిలా..

పీపీఎఫ్ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్) నియంత్రిస్తుంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వంటి అధీకృత బ్యాంకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా కూడా ఈ పథకాన్ని వినియోగదారులు పొందవచ్చు.

PPF Account online: పీపీఎఫ్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. ఆన్‌లైన్‌లోనే అప్లయ్ చేయండిలా..
PPF Scheme
Follow us

|

Updated on: May 24, 2023 | 5:00 PM

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా అనేది భారత ప్రభుత్వం ద్వా మద్దతునిచ్చే దీర్ఘకాలిక పొదుపు పథకం. పన్ను-పొదుపు ప్రయోజనాన్ని అందించడంతోపాటు వారి పదవీ విరమణ కోసం పొదుపు చేసేలా వ్యక్తులను ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించారు. పీపీఎఫ్ ఖాతా 15 సంవత్సరాల కాలవ్యవధిని కలిగి ఉంది. ఈ ఖాతా ద్వారా ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఇది తక్కువ-రిస్క్ పెట్టుబడి, అలాగే స్థిరమైన రాబడితో సురక్షితమైన పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్న వారికి అనువుగా ఉంటుంది. పీపీఎఫ్ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్) నియంత్రిస్తుంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వంటి అధీకృత బ్యాంకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా కూడా ఈ పథకాన్ని వినియోగదారులు పొందవచ్చు. అయితే ఈ పీపీఎఫ్ పథకాన్ని పొందాలంటే మాత్రం బ్యాంకులకు తిరగాల్సి వస్తుంది. అయితే ఆ ఇబ్బందిలేకుండా కేవలం ఆన్‌లైన్‌లో కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. అయితే మీ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలని మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రముఖ బ్యాంకు ఎస్‌బీఐ ఆ అవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌లో పీపీఎఫ్ ఖాతా ఎలా తెరవాలో? ఓ సారి తెలుసకుందాం. 

స్టెప్ 1: సరైన ఆధారాలను ఉపయోగించి www.onlinesbi.comలో ఎస్‌బీఐ ఆన్‌లైన్ ఖాతాకు లాగిన్ చేయండి.

స్టెప్ 2: ఎగువ కుడి మూలలో నుంచి  ‘అభ్యర్థన-విచారణలు’ విభాగం లింక్‌పై క్లిక్ చేయాలి.

ఇవి కూడా చదవండి

స్టెప్ 3: డ్రాప్-డౌన్ మెను నుండి, ‘కొత్త పీపీఎఫ్ ఖాతాలు’ లింక్‌ని క్లిక్ చేసి, ఎంచుకోవాలి.

స్టెప్-4: కొత్త విండోలో, “కొత్త పీపీఎఫ్ ఖాతా” పేజీ కనిపిస్తుంది. పేరు, చిరునామా, పాన్ కార్డ్, సీఐఎఫ్ నంబర్ వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

స్టెప్ 5: మైనర్ తరపున ఖాతాను తెరిచే వారు అందించిన స్థలంలో బాక్స్‌ను టిక్ చేయాలి. 

స్టెప్ 6: మీరు మైనర్‌పై క్లిక్ చేయకూడదనుకుంటే మీరు మీ పీపీఎఫ్ ఖాతాను తెరవడానికి సిద్ధంగా ఉన్న బ్రాంచ్ కోడ్‌ను పూరించాలి.

స్టెప్ 7: బ్యాంక్ బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ పేరును నమోదు చేయాలి. అలాగే, మీ ప్రాధాన్యత ఆధారంగా కనీసం ఐదుగురు నామినీ వివరాలను అందించాలి.

స్టెప్ 8:  అనంతరం సమర్పించు బటన్‌పై క్లిక్ చేయాలి. ‘మీ ఫారమ్ విజయవంతంగా సమర్పించబడింది’ అని స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

స్టెప్ 9: రిఫరెన్స్ నంబర్‌ను రాసి, అందించిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలి.

స్టెప్ 10: ‘ప్రింట్ పీపీఎఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్’ బటన్ నుంచి ఫారమ్ ప్రింటౌట్ తీసుకోండి.

స్టెప్ 11: చివరగా పీపీఎఫ్ ఫారమ్‌ను ఎస్‌బీఐ బ్రాంచ్‌కి సమర్పించండి. ఈ ఫారమ్‌ను మీ కేవైసీ పత్రాలు, ఇటీవలి పాస్‌పోర్ట్ ఫోటోతో 30 రోజులలోపు సమర్పించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..